‘కార్తికేయ 2′ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ’18 పేజస్’. సుకుమార్ కథ అందించిన ఈ మూవీని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘నన్నయ్య రాసిన’ అనే పాట రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 18 పేజస్ మూవీ నుంచి ఇంకో సాంగ్ బయటకి రాబోతుంది. ‘టైం ఇవ్వు పిల్లా’ అంటూ సాగే ఈ పాటని సాంగ్ ని హీరో శింబు పాడడం విశేషం. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ప్రమోషనల్ వీడియోలో శింబు… ఇది అచ్చ తెలుగు పాటలాగా ఉంది, నేను పాడితే బాగోదు అంటూనే పాట అందుకున్నాడు. టైం ఇవ్వు పిల్లా టైం ఇవ్వు పిల్లా, నిన్ను మర్చిపోవడానికి టైం ఇవ్వు పిల్లా అంటూ శింబు పాడిన విధానం వీడియోలో చాలా ఆకట్టుకునేలా ఉంది. ఓవరాల్ సాంగ్ బయటకి వస్తే 18 పేజస్ ఆల్బమ్ లో మంచి సాంగ్ బయటకి వచ్చినట్లే. గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న 18 పేజస్ మూవీని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.
ఇక శింబు తెలుగులో పాట పాడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మంచు మనోజ్ కి రెండు పాటలు, ఎన్టీఆర్ కి ‘బాద్షా’ సినిమాలో ‘డైమండ్ గర్ల్’ లాంటి పాటలు పాడిన శింబు, చాలా గ్యాప్ తర్వాత రీసెంట్ గా ‘వారియర్’ సినిమాలోని ‘బుల్లెట్ సాంగ్’తో మళ్లీ తెలుగు పాట పాడాడు. ఈ సాంగ్ తమిళ తెలుగు వర్షన్ రెండూ శింబునే పాడాడు, రెండు వర్షన్ లో ‘బుల్లెట్ సాంగ్’ సూపర్ హిట్ అయ్యింది.