Sharwanand: ‘నా’ ఒక ‘జీవితం’ సినిమాకే అంకితం- శర్వా ఎమోషనల్ లెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోల్లో శర్వానంద్ కి మంచి నటుడు అనే క్రెడిబిలిటీ ఉంది. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో శర్వా దిట్ట. ప్రస్థానం లాంటి సినిమాలో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే పెర్ఫార్మెన్స్ ఇచ్చిన శర్వా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అయ్యింది. ఈ రెండు దశాబ్దాల ప్రయాణంలో తనకి అండగా నిలిచిన అభిమానులకి థాంక్స్ చెప్తూ శర్వానంద్ ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశాడు.
Read Also: Manchu Manoj: రాజకీయాల ఆలోచన లేదు, ప్రజా సేవ చెయ్యాలన్న కోరిక వుంది
Also Read
- Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
- Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
- Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్‌కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
- Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
2004లో వచ్చిన గౌరీ సినిమాలో మొదటిసారి నటించిన శర్వా తన ఇన్నేళ్ల ఫిల్మ్ జర్నీ గురించి రాస్తూ… “20 ఏళ్లుగా ఎన్నో పాత్రలు చేస్తూ, వెండితెరపై అందర్నీ అలరిస్తున్నాను. భావోద్వేగాల తో నిండిన ఈ ప్రయాణం లో 20 సంవత్సరాల స్నేహం, కష్టాలు, ఎత్తులు, లోతులు, చిరునవ్వులు ఎన్నో మరెన్నో. అచంచలమైన ప్రేమ మరియు మద్దతుతో నా ఈ ప్రయాణం లో నాకు అండగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ 20 సంవత్సరాలు నా జీవితాన్ని, నా వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మలిచాయి. నా ఈ ‘28 ఒక జీవితం’ సినిమా కి అంకితం. 20 సంవత్సరాల క్రితం ‘శ్రీకారం’ చుట్టిన ఈ సినీ ‘ప్రస్థానం’ మరుపురానిది, మరువలేనిది. ఈ సినీ లోకం లో నా ‘గమ్యం’ ఎంతో దూరం. మిమ్మల్ని అలరించడం కోసం ప్రతి క్షణం “రన్ రాజా రన్” లా పరుగులు తీస్తూనే ఉంటాను. కృషి చేస్తూనే ఉంటాను. ‘శతమానం భవతి’ అంటూ మీరు నాకు ఇచ్చే ఆశీస్సులతో ఇది సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను. మీ శర్వానంద్” అంటూ శర్వానంద్ లెటర్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం శర్వానంద్ డైరెక్టర్ శ్రీరామ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లండన్ లో జరుగుతుంది.
Read Also: Abhiram: బాక్సాఫీస్ బరిలో రామానాయుడి మనవడికి గట్టి పోటీ!
20 years of a wonderful journey in a wonderful world called Cinema.
Cherishing every moment and blessing, which came along the way.
Thank you. pic.twitter.com/4ejEemqEOI
— Sharwanand (@ImSharwanand) March 6, 2023
తాజావార్తలు
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?