RC 16: అనౌన్స్మెంట్ టైం వచ్చేసిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ ఏ హీరో చేతికి వెళ్తుందో చెప్పడం చాలా కష్టం. ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యి, ఫాన్స్ అంతా ఆ ప్రాజెక్ట్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైంలో అది క్యాన్సిల్ అయ్యి ఇంకో హీరో చేతికి వెళ్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ ఒక మాములు వ్యవహారంలా జరిగే ఈ తంతు ఇప్పుడు చరణ్ ఎన్టీఆర్ విషయంలో కూడా జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులతో పాన్ ఇండియా సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఈ మధ్యలో ఎంత లేట్ అయినా పర్లేదు ఎన్టీఆర్ తోనే సినిమా చేస్తాను అంటూ ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు చాలా రోజులు వెయిట్ చేశాడు. విలేజ్ లో జరిగే ఒక చిన్న కథని పెద్దగా చెప్దాం అంటూ బుచ్చిబాబు, నందమూరి అభిమానులని ఆకట్టుకునే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు. దీంతో ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా పక్కా అని అంతా అనుకున్నారు.
‘ఉప్పెన’ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే రెండేళ్లు కావొస్తుంది. మంచి హిట్ తో కెరీర్ స్టార్ట్ చేసిన బుచ్చిబాబు రెండేళ్లుగా కాలీగా ఉన్నాడు. ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలో అర్ధం కానీ బుచ్చిబాబు, తన నెక్స్ట్ సినిమాని రామ్ చరణ్ తో చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం శంకర్ తో RC 15 చేస్తున్న శంకర్, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక గౌతం తిన్నునూరితో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ మూవీ క్యాన్సిల్ అవ్వడంతో, గౌతం ప్లేస్ లోకి బుచ్చిబాబు వచ్చి చేరాడు. బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమా దాదాపు ఫైనల్ అయ్యిందని… ‘వెంకట సతీష్ కిలారు’ అనే కొత్త వ్యక్తి ఈ పాన్ ఇండియా సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ లో ఫైనాన్స్ విషయాలు చూసుకునే ‘వెంకట సతీష్ కిలారు’ సొంత బ్యానర్ పెట్టుకోని ‘RC 16’ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడని, నవంబర్ 28న RC 16 మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో ఒక న్యూస్ హల్చల్ చేస్తోంది. ట్రెండ్ అవుతున్న ఈ వార్త నిజమో కాదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!