Project K: ‘K’ అంటే కాలచక్రమా? లేక ‘కల్కి’నా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ కె’ పై భారీ అంచనాలున్నాయి. సలార్ తర్వాత తక్కువ గ్యాప్‌లోనే బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతోంది ప్రాజెక్ట్ కె. ఇప్పటికే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు వైజయంతీ మూవీస్. అయితే.. ఈ డేట్‌కు ప్రాజెక్ట్ కె రావడం కష్టమనే టాక్ నడుస్తోంది కానీ మేకర్స్ మాత్రం ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. జూలై 20న శాన్ డియాగో కామిక్-కాన్ వేడుకలో ప్రాజెక్ట్ కె టైటిల్ రివీల్ చేయనున్నారు. ఇదో ప్రౌడ్ మూమెంట్ అని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ వేడుకలకు ప్రభాస్, కమల్,అమితాబ్, దీపికా, నాగ్ అశ్విన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ కె అంటే ఏంటి? అనే ఎగ్జైట్మెంట్ అందరిలోనూ ఉంది. మేకర్స్ కూడా ప్రాజెక్ట్ కె అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందా? అంటూ తెగ ఊరిస్తున్నారు.
అందుకే ప్రాజెక్ట్ కె టైటిల్ ఇదేనంటూ… సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ముందు నుంచి ప్రాజెక్ట్ కె అంటే ప్రాజెక్ట్ కల్కి, కర్ణ అనే పేర్లు వినిపించాయి. టైటిల్స్ కూడా ఇలాగే ఉండే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ, ఇప్పుడు ‘ప్రాజెక్ట్ కాలచక్ర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సైన్స్ ఫిక్షనల్ టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న సినిమా కావడంతో.. ఈ టైటిల్ ఓకె చేసినట్టు టాక్. అయితే దీని పై క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంది. ఇక దీపికా పదుకొణే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తుండగా.. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. మహానటి తర్వాత యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మ.కంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
Also Read
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
- Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
తాజావార్తలు
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!