ఈరోజు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి ఒక పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు. కర్ణాటక నుంచి యష్, కిచ్చా సుదీప్, రిషబ్… మలయాళం నుంచి మోహన్ లాల్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్… ఇక తమిళ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కోలీవుడ్ సగం మంది హీరోలకి ఇతర ఇండస్ట్రీల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఒకప్పుడు రీజనల్ సినిమాలు మాత్రమే ఎక్కువగా రిలీజ్ అయ్యేటప్పుడు ప్రభాస్ అనే ఒకరు బయటకి వచ్చి ఈ జనరేషన్ హీరోలందరికీ పాన్ ఇండియా మోజు కలిగేలా చేసాడు. ఇండియా నుంచి జపాన్ వరకూ ఫ్యాన్ బేస్ ని పెంచుకున్న ప్రభాస్, రెండు వేల కోట్ల బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టి ప్రతి హీరోకి మార్కెట్ పెంచుకోవాలనే ఆలోచన కలిగించాడు. నిజానికి ప్రభాస్ కన్నా ముందు షారుఖ్ ఖాన్, రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు మల్టీలాంగ్వేజ్ సినిమాలు చేసారు. ఈ హీరోలు గత మూడున్నర నాలుగు దశాబ్దాలుగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నా కూడా ప్రభాస్ రికార్డ్స్ క్రియేట్ చేసి టాప్ ప్లేస్ కి వెళ్లిపోయాడు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒక సినిమా నాలుగు వందల కోట్లు రాబట్టడం అంటే మాములు విషయం కాదు. హ్యూజ్ హిట్ అయితేనే ఆ సినిమాకు అన్ని కోట్లు వస్తాయి.
ఈ విషయంలో ఆమీర్ ఖాన్ బాలీవుడ్ నుంచి టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఆమీర్ కి నాలుగు 400 కోట్ల సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ నుంచి సెకండ్ ప్లేస్ లో సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ఈ భాయ్ జాన్ మూడు 400 కోట్ల సినిమాలని ఇచ్చాడు. ఈ ఇద్దరి తర్వాత రజినీకాంత్, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ లు రెండు 400 కోట్ల సినిమాలతో థర్డ్ ప్లేస్ ని షేర్ చేసుకున్నారు. వీళ్లకి మాత్రమే ఒకటి రెండు సార్లు 400 కోట్లు క్రాస్ చేసిన సినిమాలు ఉన్నాయి. వీరందరూ టాప్ హీరోలే, ఆయా ఇండస్ట్రీల్లో సూపర్ స్టార్ హీరోలే కానీ వీరందరికన్నా పైన ఉన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. రెండు మూడు కాదు ఏకంగా నాలుగు 400 కోట్ల సినిమాలతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. టాప్ ప్లేస్ లో ప్రభాస్ పేరు రాయగానే మిగిలిన స్టార్ హీరోల ప్లేస్ లు మారుతున్నాయి. సలార్ సినిమాతో ప్రభాస్ ఐదోసారి 400 కోట్ల సినిమాని ఇవ్వబోతున్నాడు. ఇదే జరిగితే ఏ సూపర్ స్టార్ హీరోకి కూడా ప్రభాస్ ని ఇప్పట్లో అందుకోవడం కష్టమే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 400 కోట్లు కలెక్ట్ చేసిన మిగిలిన హీరోల సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచినవే, ప్రభాస్ లిస్టులో మాత్రం రెండు హిట్ రెండు ఫ్లాప్స్ ఉన్నాయి. ఫ్లాప్ సినిమాలతో కూడా మిగిలిన హీరోల ఇండస్ట్రీ హిట్ రేంజులో కలెక్షన్స్ రాబడుతున్నాడు కాబట్టే ప్రభాస్ ని ఆ-డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటున్నారు.