69న నేషనల్ అవార్డ్స్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ రాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి గాను రామ్ చరణ్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ వస్తుందని మెగా ఫ్యాన్స్ చాలా హోప్ పెట్టుకున్నారు కానీ అవార్డ్ అల్లు అర్జున్ చేతికి వెళ్లింది. ఇప్పటికే మూడు సార్లు మిస్ అయ్యింది ఇక మాకు నేషనల్ అవార్డ్స్ పైన నమ్మకం లేదు అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2008లో మగధీర సినిమాకి చరణ్ కి నేషనల్ అవార్డ్ వస్తుందని ఫ్యాన్స్ భావించారు కానీ అపోజిట్ లో అమితాబ్ బచ్చన్ ‘పా’ సినిమాలో చేసిన పెర్ఫార్మెన్స్ కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 2018లో కూడా రంగస్థలం సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డ్ వస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు.
ఈ సమయంలో ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ లు బెస్ట్ యాక్టర్స్ గా నేషనల్ అవార్డుని షేర్ చేసుకున్నారు. అంధాదున్, ఉరి సినిమాలకి గాను ఈ ఇద్దరూ నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నారు. అలా 2008, 2018లో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు మిస్ అయ్యింది. ఈసారి అయినా చరణ్ కి వస్తుంది అనుకుంటే మళ్లీ మిస్ అయ్యింది అంటూ మెగా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. ఇప్పుడు మిస్ అయ్యింది కానీ రాబోయే రెండేళ్లలో చరణ్ కి నేషనల్ మిస్ అయ్యేలా కనిపించట్లేదు. ఉప్పెన సినిమాతో నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఉంది. ఈ మూవీలో చరణ్ చేసే రోల్ రా అండ్ రస్టిక్ గా ఉంటుందని బుచ్చిబాబు ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు. కరెక్ట్ గా బుచ్చిబాబు సినిమా చేయగలిగితే రామ్ చరణ్ తో పాటు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమా కేటగిరీల్లో కూడా ఆర్సీ 16కి నేషనల్ అవార్డ్స్ రావడం గ్యారెంటీ.