సోషల్ మీడియా ఉందని సెలబ్రిటీలని టార్గెట్ చేసి కామెంట్స్ చెయ్యడం అందరికీ ఈజీ అయిపొయింది. చిన్న విషయాన్ని కూడా బూతద్దం పెట్టి చూపిస్తూ ట్రోల్ చెయ్యడం ప్రతి ఒక్కరికీ అలవాటు అయిపొయింది. ముఖ్యంగా ట్విట్టర్ హేట్ కామెంట్స్, అబ్యూసింగ్ కామెంట్స్, టార్గెటెడ్ కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి కామెంట్స్ కే భూమి పడ్నేకర్ బాలి అయ్యింది. బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న భూమి పడ్నేకర్ ఇటివలే ఒక కార్యక్రమానికి అతిధిగా వెళ్లింది. ఆ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చెయ్యడానికి గెస్టులంతా స్టేజ్ పైకి వెళ్లారు. ఈ క్రమంలో భూమి పడ్నేకర్ కూడా జ్యోతి ప్రజ్వలన చెయ్యడానికి వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో భూమీ పడ్నేకర్ చెప్పులు విడవటానికి ప్రయత్నించింది కానీ అవి టైట్ గా ఉండడం కారణంగా వాటిని తీయటం ఆమె వల్ల కాలేదు. కాసేపు ప్రయత్నించి ఇక చేసేదేమీ లేక భూమి పడ్నేకర్ స్టేజి మీద నుంచి కిందకు దిగి మెట్ల దగ్గర చెప్పులు తీసే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆమెకు ఆమె అసిస్టెంట్ సహాయం చేశాడు. చెప్పులు తీసేసిన తర్వాత భూమి పడ్నేకర్ జ్యోతి ప్రజ్వలన కోసం వెళ్లిపోయింది. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలయ్యింది.
ప్రతిదీ పెద్దగా చేసి చూసే సోషల్ మీడియాలో ‘అసిస్టెంట్ తో చెప్పులు విప్పించుకున్న బాలీవుడ్ హీరోయిన్’ అనే టైటిల్ తో వీడియో బయటకి వచ్చింది. ఇంకేముంది “అంత పొగరు ఉండకూడదు, మనిషిలా ప్రవర్తించు, అసిస్టెంట్ అయితే చెప్పులు కూడా విడిపించుకోవాలా?” అదీ ఇదీ అంటూ సోషల్ మీడియాలో భూమి పడ్నేకర్ ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో భూమి పడ్నేకర్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన బయటకి రాలేదు కానీ కొంతమంది నెటిజన్స్ మాత్రం అందులో తప్పేమీ ఉంది, అయినా తను ప్రయత్నించి ఇబ్బంది పడిన తర్వాతే అసిస్టెంట్ హెల్ప్ తీసుకుంది కదా? దాన్ని కూడా నెగటివ్ గా చూస్తే ఎలా అంటూ భూమి పడ్నేకర్ ని సపోర్ట్ చేస్తున్నారు. చూస్తుంటే సెలబ్రిటిలు రాబోయే రోజుల్లో డ్రైవర్ తో డ్రైవింగ్ ఎందుకు చెయ్యించారు? వంట మనిషితో వంట ఎందుకు చేయిస్తున్నారు? పని మనిషితో పని ఎందుకు చేయిస్తున్నారు? టైలేర్ తో బట్టలు ఎందుకు కుట్టించుకుంటున్నారు? మీ బట్టలు మీరు కుట్టుకోవచ్చు కదా అనే విషయంలో కూడా విమర్శలు ఫేస్ చెయ్యాల్సి వస్తుందేమో.