దర్శక ధీరుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకొని… చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఇండియన్ టాప్ 5 లిస్ట్‌లో ట్రిపుల్ ఆర్ నిలిచింది. అందుకే ట్రిపుల్ ఆర్ సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్‌లోనే సీక్వెల్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేశాడు. రీసెంట్‌గా విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ స్టోరీ రెడీ అయింది, కాకపోతే రాజమౌళి డైరెక్షన్ చేసే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు ప్రాజెక్ట్ అయిపోగానే… జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం స్టార్ట్ చేసే అవకాశం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో… ట్రిపుల్ ఆర్ 2ని డైరెక్ట్ చేసేది ఎవరు? రామ్ చరణ్ ఎన్టీఆర్ లని బ్యాలెన్స్ చేస్తూ సినిమాని ముందుకి నడిపించేది ఎవరు? అసలు జక్కన్న చరిష్మాని మేనేజ్ చేసేది ఎవరు అనే అనుమానం అందరిలోనూ ఉంది. అయితే సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్ ప్రకారం ఆర్ ఆర్ ఆర్ 2ని తెరకెక్కించడానికి ఒక పేరు చాలా బలంగా వినిపిస్తోంది. పాన్ వరల్డ్ రేంజులో రూపొందనున్న ఈ సీక్వెల్‌కు టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, సాహసం వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన చంద్రశేఖర్ యేలేటి… చివరగా నితిన్‌తో ‘చెక్’ అనే సినిమా చేశాడు. ఈయన రాజమౌళికి దగ్గరి బంధువు. కమర్షియల్ ట్రాక్ రికార్డ్‌ను పక్కకు పెడితే… డైరెక్టర్‌గా చంద్రశేఖర్ యేలేటికి మంచి పేరుంది. అందుకే.. ట్రిపుల్ ఆర్ సీక్వెల్‌కు యేలేటి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈయన డైరెక్షన్ చేసినా కూడా రాజమౌళి పర్యవేక్షణలోనే ఆర్ ఆర్ ఆర్ 2 ఉంటుందని అంటున్నారు. మరి ఈ రూమర్స్‌లో ఎంతవరకు నిజముందో చూడాలి.