Hema Comments Shocking Reaction on Drugs Traces in Blood: బెంగళూరు డ్రగ్స్ కేసు గంట గంటకు ఒక మలుపు తిరుగుతోంది. ఆ కేసు మొత్తం ఒక ఎత్తు అయితే ఆ కేసులో ఇరుక్కున్న హేమ వ్యవహారం మరో ఎత్తులాగా అనిపిస్తోంది. బెంగళూరు ఫామ్ హౌస్ లో హేమ ఉందని అంటూ మీడియాలో వార్తలు ప్రసారమైన వెంటనే తాను అక్కడ లేనని హైదరాబాద్ లో ఉన్నానని ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ విషయం మీద బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యి మరో కేసు కూడా నమోదు చేశారు. అయితే ఆ తర్వాత కూడా హేమ ఆ డ్రగ్స్ కేసుకి తనకి సంబంధం లేదనే ప్రయత్నమే చెబుతూ వచ్చింది.
Hema : రేవ్ పార్టీ వివాదం.. ‘మా’ నుంచి హేమ తొలగింపు.. నటి కీలక వ్యాఖ్యలు
కానీ హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ట్రేసెస్ ఉండడంతో ఈ ఉదయం మీడియా ప్రతినిధులను మళ్ళీ ఆమె వివరణ అడిగే ప్రయత్నం చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో పాజిటివ్ గా రావడంపై స్పందించమని కోరిన మీడియాపై ఆగ్రహించిన హేమ, తాను ఇప్పుడేం మాట్లాడనని, సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని, అప్పటివరకు ఏం చేసుకుంటారో చేసుకోండని మీడియాపై దురుసుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక నిజానికి రేవ్ పార్టీలో పాల్గొనడానికి హేమ తన ఒరిజినల్ పేరు కాకుండా కృష్ణవేణి అని పేరు నమోదు చేసుకున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.