సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 11 గంటలకు ఏసీపీ ముందు విచారణకు పీఎస్ కు రానున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ను విచారించనున్న దర్యాప్తు అధికారి ఏసీపీ రమేష్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీలు. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వస్తున్న నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు పోలీసులు. చిక్కడపల్లి పీఎస్ వద్ద 200 మీటర్ల దూరం వరకు పోలీసులు పలు ఆంక్షలు విధించారు.
చిక్కడపల్లి పరిసర ప్రాంతాలలో ఇతర వాహనాల రాకపోకలపై పోలీసుల ఆంక్షలు విధించి, పోలీసులు
అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏసీపీ. కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న ఏసీపీ రమేష్. అటు సినీనటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు విధించారు. హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ టీమ్ మోహరించారు. అల్లు అర్జున్ ఇంటి దారిలో రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసారు. ఇతరుల ఎవరిని అల్లు అర్జున్ ఇంటి పరిసర ప్రాంతలలోకి అనుమతించట్లేదు. కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ బయలుదేరన్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి బన్నీ వాసు చేరుకున్నారు.