నార్త్, సౌత్ సినిమాలతో బిజీగా వుంది బ్యూటీ తాప్సీ. ప్రస్తుతం ఈ నటి ‘హసీన్ దిల్‌రుబా’ అనే సినిమాలో నటిస్తోంది. తాప్సీకి జోడిగా విక్రాంత్ మాస్సే నటిస్తున్నాడు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాపై ఫస్ట్లుక్ విడుదల చేసిన దగ్గర నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా కారణంగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. జులై 2న నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని స్వయంగా తాప్సీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. పలు బాలీవుడ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తాప్సీ పెద్దదిక్కుగా మారింది. ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ జీతాధారంగా వస్తున్న ‘శభాష్ మిథు’ చిత్రంలోనూ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక ఆమె నటించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘రష్మీ రాకెట్’ కూడా విడుదలకు సిద్దమవుతుంది.
Kahani Aashiqana. Raaz Katilana.#HaseenDillruba coming soon. Only on Netflix. #TheUltimateKaunspiracy pic.twitter.com/fMGgM8J1K1
— taapsee pannu (@taapsee) June 3, 2021