Hello Meera: హరీష్ శంకర్ ఆవిష్కరించిన ‘హలో మీరా’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hello Meera: సింగిల్ క్యారెక్టర్, డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని ‘హలో మీరా’ అంటూ ఓ కొత్త తరహా థ్రిల్లింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. ఎలాంటి భారీ తారాగణాన్ని ఎంచుకోకుండా ప్రయోగాత్మక కథతో ఈ మూవీ ప్లాన్ చేసి షూట్ చేశారు. ప్రముఖ దర్శకులు బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి ఈ సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఫేమస్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా ‘హలో మీరా’ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ వీడియో చూసిన హరీష్ శంకర్, ‘ఈ మూవీ ఎంతో ఆసక్తికరంగా ఉండటమే గాక వైవిధ్యభరితంగా ఉండనుందని ఈ టీజర్ ద్వారా తెలస్తోంద’ని చెప్పారు. ఈ మేరకు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే ఒక నిమిషం 16 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ‘హలో మీరా’ టీజర్ లో సినిమా సోల్ చూపిస్తూ ఆసక్తి రేకెత్తించారు దర్శకుడు శ్రీనివాసు. మీరా అనే సింగిల్ క్యారెక్టర్, ఆమెకు వచ్చే ఫోన్ కాల్స్ అందులోని ట్విస్టులు ఈ మూవీ కథపై ఇంట్రెస్ట్ నెలకొల్పాయి. పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి రాత్రికి రాత్రి ఆ పెళ్లి కాదనుకొని కారులో హైదరాబాద్ బయల్దేరడం, ఇంతలో అమ్మానాన్న, ఫ్రెండ్స్, లవర్, పోలీసుల నుంచి ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడం.. దాంతో మీరా పరిస్థితి ఏమైంది? అనే కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ గా ఈ మూవీ ఉండనుందని టీజర్ స్పష్టం చేసింది. ‘హలో మీరా’ అనే క్యాచీ టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో రూపొందిస్తున్నారు. చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా ఎస్. చిన్న సంగీతం అందించారు.
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!