ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇటీవలే ‘హరిహరవీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా తరువాత వెంటనే ‘భవదీయుడు భగత్ సింగ్’ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ కాంబోలో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ ను పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా చూపించిన హరీష్.. భవదీయుడు భగత్ సింగ్ లో లెక్చరర్ గా చూపిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు గుప్పుమన్న విషయం విదితమే.
ఇక తాజగా హరీష్ కూడా పవన్ పాత్రపై క్లారిటీ ఇచ్చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ ఈ వ్యాఖ్యలు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ” పవన్ కళ్యాణ్ ఇందులో పోరు ఫుల్ ప్రొఫెసర్ గా కనిపిస్తారు. ఆయన పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తోంది. పవన్ అభిమానులు ఏది అయితే కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే ఉండబోతోంది” అని చెప్పినట్లు సమాచారం. ఇక దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టేసుకున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లి, ఎప్పుడు షూటింగ్ ను పూర్తి చేసుకొని ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.