AHA: లాస్యప్రియ గాత్రానికి హరీశ్ రావు ఫిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lasya Priya: ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ -2 విజయవంతంగా సాగుతోంది. ఇందులోని కంటెస్టెంట్స్ ప్రతిభకు సినీ, సంగీత రంగాలకు చెందిన వారే కాదు… రాజకీయ నేతలూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండియన్ ఐడల్ -2లో సిద్ధిపేటకు చెందిన లాస్య ప్రియ చక్కటి గాత్రంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె గానానికి తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు సైతం ఫిదా అయిపోయారు. ఇటీవల ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్2లో పార్టిసిపేట్ చేసే లాస్యప్రియ ప్రతిభ గురించి రాశారు. ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’లో అత్యంత ప్రతిభను చూడటం చాలా ఆనందంగా అనిపించింది. లాస్యప్రియ గళం నా చెవుల్లో మారుమోగుతోంది. ఆమె భవిష్యత్ ప్రణాళికలన్నీ సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని ట్వీట్ చేశారు హరీష్ రావు. ప్రజాదరణ పొందిన, ప్రజల మనసులకు దగ్గరైన తెలుగు పాటలను హృద్యంగా ఆలపిస్తూ సంగీతప్రియుల అభిమానాన్ని అందుకుంటోంది లాస్యప్రియ. ఇప్పుడున్న ఎనిమిది మంది కంటెస్టంట్లలో ఆమె ఒకరు. లాస్యప్రియ పెర్ఫార్మెన్స్ మెచ్చి న్యాయ నిర్ణేతలు ఎప్పటికప్పుడు అభినందనలు చెబుతూనే ఉన్నారు. శ్రోతల్లోనూ ఆమె గళానికి ముగ్దులవుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
ఆహా లో జరుగుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 2 సింగింగ్ కాంపిటీషన్లో అద్భుతంగా పాటలు పాడుతూ అందర్నీ మెప్పిస్తున్న సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియకు హృదయపూర్వక అభినందనలు. నీ సంగీత ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/BT9c3GQKjl
Also Read
— Harish Rao Thanneeru (@BRSHarish) April 20, 2023
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!