HHVM : అవన్నీ అవాస్తవం.. రిలీజ్ డేట్ పై ‘వీరమల్లు’ క్లారిటీ

  • జూన్ 26 అంటూ ప్రచారం
  • ఖండించిన టీమ్
  • కొత్త డేట్ పై రిక్వెస్ట్
Hhvm

Hhvm

HHVM : పవన్ కల్యాణ్‌ నటించిన హరిమర వీరమల్లు మూవీ జూన్ 26న రిలీజ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. ఏకంగా పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. అఫీషియల్ టీమ్ నుంచి వచ్చినట్టే పోస్టర్లు ఉండటంతో ఫ్యాన్స్ నిజమా కాదా అని కన్ ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో మూవీ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిలీజ్ డేట్స్ అన్నీ నిజం కాదని తేల్చి చెప్పింది. మూవీ రిలీజ్ డేట్ ను తామే స్వయంగా ప్రకటిస్తామని చెప్పింది.

Read Also : Akhanda 2 Teaser : అఖండ 2 టీజర్ రివ్యూ.. గూస్ బంప్స్ అంతే..

అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి వచ్చే వాటినే నమ్మాలని.. సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చింది. రిలీజ్ డేట్ ను త్వరలోనే తాము ప్రకటిస్తామని.. అప్పటి వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాలని కోరింది. వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. చివరకు వాయిదా వేశారు. కానీ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు.

ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తుండటంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి మూవీ కావడంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Read Also : Balakrishna Fans : థియేటర్లోకి బీర్, ఇడ్లీ.. బాలయ్య ఫ్యాన్స్ హంగామా