టీవీ స్క్రీన్‌పై అటు గ్లామర్‌తోనూ, ఇటు డాషింగ్ యాంకరింగ్‌తోనూ ప్రేక్షకుల మనసు దోచింది అనసూయ భరద్వాజ్. ప్రజంట్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో.. మంచి పాత్రలు ఎంచుకుంటూ తన కంటూ ఒక మార్కెట్ సంపాదించుకుంటోంది. కానీ ఈ స్థాయికి చేరే ముందు ఆమె ప్రయాణం ఎలా ఉండేదో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తన కెరీర్ ప్రారంభ దశ గురించి మాట్లాడిన అనసూయ, చాలామందిని ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడించారు.
Also Read : Bhadrakali : లైవ్‌లో గన్ షూటింగ్ చేసిన సురేష్ బాబు, విజయ్ ఆంటోనీ..
అనసూయ మాట్లాడుతూ.. ‘ నేను మొదట VFX కంపెనీలో HRగా పని చేశాను. అదే సమయంలో 2008లో విడుదలైన ఎన్టీఆర్ నటించిన, ‘కంత్రి’ సినిమాలో , చిన్న యానిమేటెడ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ (కార్టూన్ స్టైల్‌లో) గుర్తుందా? ఆ ప్రాజెక్టు జరుగుతున్న సమయంలో ఆ కంపెనీలో HR గా పనిచేస్తున్న. అప్పుడే దర్శకులు సుకుమార్, మెహర్ రమేష్ తదితరులు నన్ను గమనించారు” అంటూ అనసూయ ఆనాటి జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఈ ఒక్క కామెంట్ ఆమె సినీ రంగంలోకి ఎలా అడుగుపెట్టిందనే ప్రయాణాని స్పష్టంగా తెలిపింది. అప్పటి పరిచయాలు, పరిశ్రమతో ఏర్పడిన సంబంధాలు , ఆమె కెరీర్‌కు మలుపు తిప్పినట్లు తెలుస్తోంది. VFX ప్రపంచం నుంచి స్టార్ యాంకర్, విలక్షణ నటి వరకు వచ్చిన ఆమె జర్నీ అనేక మందికి ప్రేరణ గా నిలుస్తోంది.