ఒక చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి… ప్రమోషన్స్ లో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకుంది హనుమాన్ సినిమా. ఈ మూవీ రిలీజ్ అయ్యి అన్ని సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. హనుమాన్ మూవీ కలెక్షన్స్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. నార్త్ నుంచి ఓవర్సీస్ వరకు హనుమాన్ మూవీ సెన్సేషనల్ థియేట్రికల్ రన్ ని మైంటైన్ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో హనుమాన్ సినిమా దెబ్బకి స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ మూవీ కలెక్షన్స్ కూడా చెల్లాచెదురు అవుతున్నాయి. ఇలా నార్త్ బెల్ట్, ఓవర్సీస్ లో సూపర్బ్ రన్ మైంటైన్ చేస్తున్న హనుమాన్ మూవీకి తెలుగులో మాత్రం ఇంకా ప్రాపర్ రిలీజ్ దొరకలేదు. నైజాంలో అయితే హనుమాన్ సినిమా ఎక్కడ ఆడుతుంది, ఏ సెంటర్ లో ఉంది అని వెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
మొదటి వారంలో థియేటర్స్ లేక బాగా ఇబ్బంది పడిన హనుమాన్ సినిమాని ప్రేక్షకులు మాత్రం ఎక్కడ ఉన్నా వెట్టుకుంటూ వెళ్లి చూసారు. ఈ కారణంగానే హనుమాన్ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ కన్నా ట్రిపుల్ బిజినెస్ చేసి చేసింది. అన్ని సెంటర్స్ లో హనుమాన్ కలెక్షన్స్ ఓవర్ ఫ్లో అవుతున్నాయి. థియేటర్స్ తక్కువ ఉండడం కూడా హనుమాన్ సినిమా బాగా కలిసొచ్చింది. ఎక్కువ మంది ఈ సినిమా చూడలేదు కాబట్టి ఇప్పుడు సెకండ్ వీక్ లో థియేటర్స్ ఎక్కువ హనుమాన్ కి వెళ్లిపోతున్నాయి. ఈరోజు నుంచే హనుమాన్ కి థియేటర్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పటివరకు సినిమా చూడని వాళ్లు థియేటర్స్ కి వెళ్లిపోతారు. దీంతో హనుమాన్ కలెక్షన్స్ సెకండ్ వీక్ లో కూడా రాక్ సాలిడ్ గా ఉండబోతున్నాయి.