Hanuman: ఆ రేంజ్ ఫుట్ ఫాల్స్ ఈమధ్య కాలంలో చూడలేదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమాన్… తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రికార్డులు సృష్టించడమే పనిగా పెట్టుకుంది. జనవరి 12న అండర్ డాగ్ గా థియేటర్స్ లోకి వచ్చిన హనుమాన్ సినిమా… సంక్రాంతి సినిమాలన్నీ కలిపి ఎంత కలెక్ట్ చేశాయో, అంతా కలిపి హనుమాన్ మాత్రమే కలెక్ట్ చేస్తోంది. కంటెంట్ మాత్రమే గెలుస్తుంది అనే మాటని నిజం చేస్తూ హనుమాన్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రిలీజై మూడు వారాలు అవుతున్నా హనుమాన్ సినిమా స్లో అవుతున్నట్లు కనిపించలేదు. తెలుగు స్టేట్స్‌లో ప్రతి రోజు కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తున్న హనుమాన్ సినిమా… వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకూ 250 కోట్లకుగాపై గ్రాస్… 130 కోట్ల వరకు షేర్ కొల్లగొట్టి చేసింది. తెలుగులో స్టార్ హీరోల సినిమాలు కాకుండా.. మిడ్ రేంజ్, యంగ్ హీరోలు నటించిన సినిమాలేవి ఇప్పటివరకు 250 కోట్ల వసూళ్లను రాబట్టలేదు. ఈ ఘనతను సాధించిన ఫస్ట్ మూవీగా హనుమాన్ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక ఈ వారంలో కొత్త తెలుగు సినిమాల రిలీజ్‌లు కూడా లేకపోవడంతో హనుమాన్ 300 కోట్ల మార్క్‌ను చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నార్త్ అమెరికాలో కూడా హనుమాన్ ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. ఈ మూవీ నార్త్ అమెరికాలో 5 మిలియన్ మార్క్ ని చేరుకుంది. నాన్-రాజమౌళి, నాన్-ప్రభాస్ రికార్డుల తర్వాత హనుమాన్ సినిమానే టాప్ లో ఉంది. నార్త్ లో కూడా హనుమాన్ సినిమా సాలిడ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తూ టిల్ డేట్ కేవలం హిందీలోనే 50 కోట్ల మార్క్ కు చేరువలో ఉంది. కలెక్షన్స్ పక్కన పెట్టి ఫుట్ ఫాల్స్ విషయంలో చూస్తే ఈ మధ్య కాలంలో ఏ సినిమా నమోదు చేయని నంబర్స్ ని హనుమాన్ సినిమా సొంతం చేసుకుంది. దాదాపు కోటి ఫుట్ ఫాల్స్ ని హనుమాన్ సినిమా సొంతం చేసుకోవడం గొప్ప విషయం.
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
The whole of the world is celebrating #HanuMan with all their heart ❤️
Humongous 1CRORE+ FOOTFALLS and continues to show its dominance all over 🔥
Nizam Release by @MythriOfficial ❤️🔥
A @PrasanthVarma film
🌟ing @tejasajja123#HanuManEverywhere… pic.twitter.com/n2wxO47epI— Mythri Movie Makers (@MythriOfficial) January 28, 2024
తాజావార్తలు
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
ట్రెండింగ్
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!