NTV Telugu Site icon

Hanuman: ఆ రేంజ్ ఫుట్ ఫాల్స్ ఈమధ్య కాలంలో చూడలేదు…

Hanuman

Hanuman

హనుమాన్… తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రికార్డులు సృష్టించడమే పనిగా పెట్టుకుంది. జనవరి 12న అండర్ డాగ్ గా థియేటర్స్ లోకి వచ్చిన హనుమాన్ సినిమా… సంక్రాంతి సినిమాలన్నీ కలిపి ఎంత కలెక్ట్ చేశాయో, అంతా కలిపి హనుమాన్ మాత్రమే కలెక్ట్ చేస్తోంది. కంటెంట్ మాత్రమే గెలుస్తుంది అనే మాటని నిజం చేస్తూ హనుమాన్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రిలీజై మూడు వారాలు అవుతున్నా హనుమాన్ సినిమా స్లో అవుతున్నట్లు కనిపించలేదు. తెలుగు స్టేట్స్‌లో ప్రతి రోజు కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తున్న హనుమాన్ సినిమా… వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకూ  250 కోట్ల‌కుగాపై గ్రాస్‌… 130 కోట్ల వ‌ర‌కు షేర్ కొల్లగొట్టి చేసింది. తెలుగులో స్టార్ హీరోల సినిమాలు కాకుండా.. మిడ్ రేంజ్‌, యంగ్ హీరోలు న‌టించిన సినిమాలేవి ఇప్ప‌టివ‌ర‌కు 250 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేదు. ఈ ఘ‌న‌త‌ను సాధించిన ఫ‌స్ట్ మూవీగా హనుమాన్ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక ఈ వారంలో కొత్త తెలుగు సినిమాల రిలీజ్‌లు కూడా లేకపోవడంతో హనుమాన్ 300 కోట్ల మార్క్‌ను చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నార్త్ అమెరికాలో కూడా హనుమాన్ ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. ఈ మూవీ నార్త్ అమెరికాలో 5 మిలియన్ మార్క్ ని చేరుకుంది. నాన్-రాజమౌళి, నాన్-ప్రభాస్ రికార్డుల తర్వాత హనుమాన్ సినిమానే టాప్ లో ఉంది. నార్త్ లో కూడా హనుమాన్ సినిమా సాలిడ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తూ టిల్ డేట్ కేవలం హిందీలోనే 50 కోట్ల మార్క్ కు చేరువలో ఉంది. కలెక్షన్స్ పక్కన పెట్టి ఫుట్ ఫాల్స్ విషయంలో చూస్తే ఈ మధ్య కాలంలో ఏ సినిమా నమోదు చేయని నంబర్స్ ని హనుమాన్ సినిమా సొంతం చేసుకుంది. దాదాపు కోటి ఫుట్ ఫాల్స్ ని హనుమాన్ సినిమా సొంతం చేసుకోవడం గొప్ప విషయం.