టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హనుమాన్. ఈ మూవీనీ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతోంది.హనుమాన్ ప్రమోషన్స్‌లో భాగంగా తేజా సజ్జా తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో కావాలనే ఆలోచనలో 2014 నుంచి ఆడిషన్స్ చేయడం మొదలుపెట్టానని, కానీ తనకు ఎవరూ కూడా అవకాశాలు ఇవ్వలేదని అన్నాడు. కొన్ని సినిమాలు అనౌన్స్ చేసిన కూడా తర్వాత ఆగిపోయానని, మరికొన్నింటిని నాతో చేయాలని అనుకొని చివరి నిమిషంలో వేరే హీరోను తీసుకున్నారని పేర్కొన్నాడు. అవన్నీ నాకు ఇండస్ట్రీలో మంచి అనుభవాలుగా మిగిలిపోయానని తేజ సజ్జా తెలిపాడు.
హీరోగా నేను చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇంట్లో వాళ్లు కూడా సినిమాల్ని వదిలేయమని సలహా ఇచ్చినట్లు తెలిపాడు.. అవన్నీ చూసి తాను ఎంతగానో డిస్సపాయింట్ అయ్యానని మంచి సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాలని చాలా రోజులు ఎదురుచూశానని, చివరకు ఓ బేబీతో ఆ కల తీరిందని తేజా సజ్జా కామెంట్స్ చేశాడు.అయితే నితిన్ , డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీ ఆంజనేయంతో హనుమాన్ సినిమాకు పోలికలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండు కథలు ఒకటేనని అంటున్నారు. ఈ రూమర్స్‌పై తేజా సజ్జా రియాక్ట్ అయ్యాడు. శ్రీఆంజనేయంతో హనుమాన్ కథకు ఎలాంటి సంబంధం ఉండదని తేజా సజ్జా తెలిపాడు.శ్రీ ఆంజనేయం సూపర్ హీరో కథ కాదని తెలిపాడు.శ్రీ ఆంజనేయంలో నితిన్ పక్కన అర్జున్ రూపంలో ఆంజనేయుడు ఉంటాడని, కానీ హనుమాన్‌లో అంజనేయుడి క్యారెక్టర్ కనిపించదని తేజ సజ్జా తెలిపాడు.. స్పైడర్‌మ్యాన్ తరహాలో సూపర్ హీరో కథతో హనుమాన్ మూవీని ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడని తేజా సజ్జా తెలిపాడు.. దేవుడి ఆశీస్సులతో సాధారణ యువకుడు ధర్మ కోసం ఎలాంటి పోరాటం చేశాడన్నది ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమాలో చూపించినట్లు తెలిపాడు.