HanuMan Becomes 6th Highest Grossing Movie at North America: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చాలా తక్కువ ఖర్చుతో రిచ్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ రావడంతో సినిమా చూసిన వారందరూ సినిమా మీద ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఆసక్తికరమైన వసూళ్లు తెచ్చుకుంటూ సినిమా కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డ్స్ బద్దలు కొడుతోంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజులు కూడా గడవకుండానే యుఎస్ మార్కెట్లో కూడా సత్తా చాటింది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ మార్కెట్లో ఆల్ టైం టాప్ 6 గ్రాసర్ గా నిలిచింది. ఇక అమెరికాలో తాజాగా 3.5 మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసి ఆల్ టైం టాప్ సిక్స్త్ టాలీవుడ్ గ్రాసర్ మూవీ గా నిలిచింది.
Samantha Hanuman Review: ‘హనుమాన్’ మూవీకి సమంత రివ్యూ
అంతేకాదు అతి త్వరలోనే ఐదవ ప్లేసులోకి వెళ్లేందుకు కూడా సిద్ధమైంది. నిజానికి ఇప్పటివరకు బాహుబలి 28 డాలర్లు, ఆర్ఆర్ఆర్ 14.3 మిలియన్ డాలర్లు, సలార్ 8.9 మిలియన్ డాలర్లు, బాహుబలి వన్ ఎయిట్ మిలియన్ డాలర్లు అల వైకుంఠపురంలో 3.6 మిలియన్ డాలర్లు, రంగస్థలం 3.5 మిలియన్ డాలర్లు సాధించాయి. రంగస్థలం కంటే ఎక్కువ వసూలు చేసి టాప్ సిక్స్ లోకి ఈ హనుమాన్ చేరింది. త్వరలోనే టాప్ ఫైవ్లోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి తన తొలి సినిమాగా నేర్పించారు. మొదటి సినిమాని ఇంత సూపర్ సక్సెస్ ఇవ్వడంతో ఆయనైతే ప్రస్తుతానికి క్లౌడ్ నైన్ లో ఉన్నారు.