Hansika : వదినపై ‘దేశముదురు భామ’ 2 కోట్ల పరువునష్టం దావా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘దేశముదురు’ భామగా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక మోత్వానీ ప్రస్తుతం కుటుంబ వివాదంలో చిక్కుకున్నారు. గత కొంతకాలంగా తనపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఆమె ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హన్సిక వదిన నాన్సీ జేమ్స్ (ముస్కాన్) గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా హన్సిక కుటుంబంపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు, హన్సిక కుటుంబ సభ్యులు తనను శారీరకంగా, మానసిక వేదనకు గురిచేశారని, తాను గృహహింసకు గురయ్యానంటూ ఆమె చేసిన పోస్ట్‌లు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఆరోపణలు హన్సిక వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని హీరోయిన్ వర్గం వాదిస్తోంది. తనపై మరియు తన కుటుంబంపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తూ, సమాజంలో తమ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హన్సిక ముంబై సెషన్స్ కోర్టులో రూ. 2 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కేవలం డబ్బు వసూలు చేసే ఉద్దేశంతోనే నాన్సీ ఇదంతా చేస్తోందని హన్సిక తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read :Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే
Also Read
- OG Satellite Rights: ఓజీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న టాప్ ఛానల్!
- Boman Irani: పెద్ది ట్రైలర్‌లోని ఆ సీన్ వెనుక ఎంత కథ ఉందో తెలుసా? ఆ ఒక్క డైలాగ్ కోసం 78 టేక్స్ తీసుకున్నాడట!
- Sai Rajesh: 'వ్యూస్ కొంటున్నాం.. డబ్బులిచ్చి కామెంట్స్ రాయిస్తున్నాం' 'బేబీ' డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
- Megastar Chiranjeevi: రెండు రోజుల్లో రెండోసారి.. ఎగ్జిబిటర్లతో చిరంజీవి మీటింగ్! 'పెద్ది' విషయంలో కీలక నిర్ణయం..
ఈ కేసును విచారించిన ముంబై సెషన్స్ కోర్టు ప్రాథమిక ఆధారాలను పరిశీలించి కీలక ఆదేశాలు జారీ చేసింది. హన్సికకు వ్యతిరేకంగా ఎలాంటి పబ్లిక్ స్టేట్‌మెంట్స్ గానీ, ఆరోపణలు గానీ చేయకూడదని ముస్కాన్‌ను ఆదేశిస్తూ తాత్కాలిక స్టే విధించింది. ఇటీవలే భర్త సోహైల్ కతూరియాతో విడాకులు తీసుకున్న హన్సిక, వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ బాధ నుండి కోలుకోకముందే, ఇప్పుడు సొంత కుటుంబంలోనే ఆస్తులు, ఇతర కారణాలతో గొడవలు మొదలై కోర్టు వరకు వెళ్లడం అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది. అయితే ఇంటి గుట్టు ఇలా కోర్టు మెట్లు ఎక్కడం హన్సిక కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్‌లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!