చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్, కోలీవుడ్‌లలో బిజీ హీరోయిన్‌గా పేరుపొందిన నటి హన్సిక. దాదాపు అందరి హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజెంట్ సిరీస్, ప్రముఖ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. సినిమాల విషయం పక్కన పెడితే. గత కొద్ది రోజులుగా హన్సిక వ్యక్తిగత జీవితం గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read : Rashmika: ప్రేమ అంటే గౌరవించడం, కంట్రోల్ చేయడం కాదు..
తన స్నేహితురాలి మాజీ భర్త, వ్యాపారవేత్త అయిన సోహైల్ ఖతురియాతో ప్రేమలో పడిన హన్సిక. వీరిద్దరూ 2022లో పెళ్లి చేసుకున్నారు. ఆతరువాత ఆమె పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే పెళ్లయి మూడేళ్లు కూడా కాకముందే, సోహైల్ ఖతురియాతో మనస్పర్థల వల్ల హన్సిక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపించాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. హన్సిక తన భర్త తో దిగిన ఫొటోలను సోషల్ మీడియా నుంచి తీయడం తో అనుమానాలు కాస్త బలపడ్డాయి. వినాయక చవితి, దీపావళి వంటి పండుగలు ఇద్దరు వేర్వేరుగా జరుపుకున్నారని టాక్. పిక్స్ లో కూడా హన్సిక ఒంటరిగానే కనపడింది. ఇక ఈ విడాకుల వివాదం ఒకవైపు నడుస్తుండగా, ఆమె సడెన్‌గా తన పేరు మార్చుకుంది. ఇంగ్లీషులో “Motwani”ని ఇప్పుడు ‘Motwanni’ గా మార్చింది. అయితే ఈ మార్పుకు కారణం ఏంటి అనేది ఆమె వెల్లడించలేదు.. అయితే,
తాజాగా హన్సిక తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పష్టత ఇచ్చింది.. ‘ఇది ఎలాంటి వ్యక్తిగత కారణాలతో చేయలేదు. ఇది మా అమ్మ ఐడియా. అమ్మకు న్యూమరాలజీ అంటే నమ్మకం ఎక్కువ. చాలా రోజులుగా ఈ విషయం గురించి డిస్కషన్ జరుగుతుంది. కొన్నిసార్లు వాదనలు కూడా జరిగాయి. చివరికి అమ్మ మాట కాదనలేక, కొత్త స్పెల్లింగ్‌కి ఓకే చెప్పాను’ అని చెప్పింది హన్సిక. తన కొత్త పేరుతో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, మంచి వైబ్స్ వస్తాయని తల్లి నమ్ముతుందట. అందుకే ‘Motwanni’ అనే స్పెల్లింగ్‌ని ఎంచుకున్నానని తెలిపింది. ఇకపోతే, తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్‌పై కూడా హన్సిక సరదాగా స్పందించింది.. “నా పేరు మార్చుకున్న, నా పర్సనల్ లైఫ్ మార్చుకోలేదు. అది నా పర్సనల్ మాత్రమే” అంటూ నవ్వేసింది.