హన్సిక.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చైల్డ్ ఆర్టిస్ట్ గా కోయి మిల్ గయా సినిమా లో హృతిక్ రోషన్ సరసన నటించింది..ఆ తరువాత హీరోయిన్ గా మారీ తెలుగు మరియు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించింది. స్టార్ హీరోల సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా వరుస సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్న హన్సిక గత సంవత్సరం పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్న హన్సిక హీరోయిన్ గా కూడా సినిమాలలో రానిస్తుంది..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక తన సినీ కెరియర్ గురించి కొన్ని విషయాలను వెల్లడించినట్లు సమాచారం. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా తో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. అతి తక్కువ వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక..దేశముదురు సినిమా సమయంలో తనకు కేవలం 16 సంవత్సరాలు వయసు మాత్రమే అని హన్సిక చెప్పుకొచ్చింది.. అంత చిన్న వయసులోనే నేను సొంతంగా కారు ఇల్లు కూడా కొనగలిగాను అని ఆమె తెలిపింది.. దేశముదురు సినిమా అవకాశం ఎలా వచ్చిందో కూడా హన్సిక తెలియజేశారు. దేశముదురు సినిమాలో అవకాశం రావడానికి డైరెక్టర్ మెహర్ రమేష్ కారణమని తెలిపింది.. మెహర్ రమేష్ వలన నేను సినీ కెరియర్ లో ఎంతో సక్సెస్ సాధించానని హన్సిక తెలిపారు. పూరి జగన్నాథ్ గారు దేశముదురు సినిమా కోసం హీరోయిన్ ను వెతుకుతున్నారనే విషయం తెలియడంతో మెహర్ రమేష్ గారు నా ఫోటో ను ఆయనకు పంపి ఈ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో అద్భుతంగా నటించింది ఈ సినిమాలో ఒక ఛాన్స్ ఇవ్వమని పూరిజగన్నాధ్ గారిని కోరినట్లు తెలిపింది.వెంటనే పూరి సర్ నా ఫోటో షూట్ చేసి వెంటనే నన్ను సినిమాలోకి తీసుకున్నట్లు హన్సిక తెలిపింది.