Gunturu Kaaram: మనలో మన మాట.. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటారా మాస్టరూ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gunturu Kaaram: కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమాల్లో గుంటూరు కారం ఒకటి. అతడు, ఖలేజా సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలయ్యిందో కానీ, అప్పటి నుంచి ఆటంకాలే.. ఆటంకాలు. సజావుగా షూటింగ్ సాగింది లేదు. ఒకదాని తరువాత ఒకటి ఈ సినిమాకు అడ్డుగోడలుగా నిలుస్తూ వచ్చాయి. ఇక మధ్యలో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి కొద్దిగా అభిమానులకు ఉపశమనం అందించారు. సరే ఇకనుంచి అయినా షూటింగ్ పూర్తిచేస్తారు అనుకుంటే..సినిమా నుంచి ఒక్కొక్కరిగా వెళ్లిపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. మొదట మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అవుట్ అన్నారు.. లేదు ఆ తరువాత పూజా హెగ్డే అవుట్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక థమన్ ఇన్ అని పూజా మాత్రమే అవుట్ అని చెప్పుకొచ్చారు.
Snakes: అల్లుళ్లకు కట్నంగా స్నేక్ రాజాలు.. అదే వారి ఆచారం..!
Also Read
పూజా ప్లేస్ లో మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. ఇక సరే ఇకనుంచి అయినా షూటింగ్ నార్మల్ గా సాగుతుంది అనుకున్నారు. అంతలో మహేష్ బాబు వెకేషన్ అంటూ చెక్కేశాడు. ఈలోపే మరో పిడుగులాంటి వార్త. తాజాగా సినిమాటోగ్రాఫర్ మారిపోయాడు. కొన్ని అనివార్య కారణాల వలన ps వినోద్ గుంటూరు కారం నుంచి తప్పుకున్నాడని, ఆయన ప్లేస్ లో కె రవిచంద్రన్ వచ్చి చేరాడని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమాకు ఏమయ్యింది. ఎందుకు ఇలా క్యాస్ట్ అండ్ క్రూ ఒక్కొక్కరిగా తప్పుకుంటున్నారు. అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి ఈ విషయమై త్రివిక్రమ్ అసలు స్పందిస్తాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!