2024 సంక్రాంతి నెవర్ బిఫోర్ యుఫోరియాని క్రియేట్ చేసేలా ఉంది. రవితేజ నుంచి తేజ సజ్జా వరకూ చాలా మంది హీరోలు తమ సినిమాలని సంక్రాంతి రేస్ లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సలార్ డిసెంబర్ లో రిలీజ్ అవుతుండడం, కల్కి సంక్రాంతి నుంచి షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుండడంతో… ఇదే మంచి టైం అనుకోని చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈగల్, హను మాన్, నా సామీ రంగ, VD 13 సినిమాలు రిలీజ్ రేస్ లో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ మరిచిపోతున్న విషయం, తేలిగ్గా తీసుకుంటున్న విషయం కల్కి ఇంకా అఫీషియల్ గా వాయిదా పడలేదు. ఒకవేళ కల్కి వాయిదా పడినా రవితేజ, నాగార్జున, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు తమ సినిమాలని మహేష్ బాబు సినిమాకి పోటీగా రిలీజ్ చేయకూడదు.
సంక్రాంతి సీజన్ లో రెండు పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమాకి మన దగ్గర స్కోప్ ఉంది. ఈ ట్రాక్ లో రిలీజ్ అయినా మూడు సినిమాలు హిట్ అయిన హిస్టరీ కూడా ఉంది మన దగ్గర కానీ అన్నీ స్టార్ హీరోల సినిమాలే, అన్నీ భారీ బడ్జట్ సినిమాలే అంటే మాత్రం వర్కౌట్ అవ్వడం కష్టమే. ప్రతి సినిమా నష్టపోయే అవసరం ఉంది. ముఖ్యంగా గుంటూరు కారం సినిమాని ఇతర దర్శక నిర్మాతలు చాలా లైట్ తీసుకుంటున్నట్లు ఉన్నారు. ఈ సినిమా వాయిదా పడుతుందేమో అనే హోప్ తో రిలీజ్ డేట్ ప్రకటిస్తున్నట్లు ఉన్నారు. గుంటూరు కారం సినిమా వాయిదా పడితే పర్లేదు కానీ ఒకవేళ అదే డేట్ కి రిలీజ్ అయితే మాత్రం మిగిలిన ప్రతి సినిమాకి అమలాపురం నుంచి అమెరికా వరకూ నష్టాలు తప్పవు. ఎందుకంటే మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ ఇద్దరూ కలిసి హిట్ ఇవ్వలేదు కానీ మంచి సినిమాలని ఇచ్చారు.
మహేష్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ డైలాగ్స్ వర్కౌట్ అయితే చాలు గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మహేష్ కి యావరేజ్ సినిమా పడితేనే రీజనల్ రికార్డ్స్ పెడతాడు అలాంటిది త్రివిక్రమ్ తగిలితే ఎలా ఉంటుందో ఊహించొచ్చు, పైగా ఈ కాంబినేషన్ కోసం ఆడియన్స్ 12 ఏళ్లుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా గుంటూరు కారం సినిమాపై ఏవేవో రూమర్స్ వస్తుండడం, పూజా హెగ్డే తప్పుకోవడం, సాంగ్ డిలే అవుతూ ఉండడం లాంటి విషయాల కారణంగా గుంటూరు కారం బజ్ కాస్త తగ్గింది కానీ ఒక్కసారి టీజర్ లేదా సాలిడ్ ఫస్ట్ సాంగ్ బయటకి వస్తే చాలు గుంటూరు కారం సినిమా మేనియా మొదలైపోతుంది. సో ఈ మూవీ రేస్ లో ఉంటే మాత్రం మిగిలిన సినిమాల్లో కొన్ని సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవడం గ్యారెంటీ.