Guntur Kaaram: గుంటూరు కారం ట్రైలర్ వచ్చేస్తోంది.. రెడీ అవ్వండమ్మా
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మీనాక్షీ చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అవుతుంది. సంక్రాంతి పోటీల్లో గుంటూరు కారంపైనే ఎక్కువ హైప్ ఉంది. అతడు, ఖలేజా వంటి కమర్షియల్ సినిమాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరు మీద ఉన్నాయి.
ఇక మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ టైమ్ సెట్ చేశారు. ట్రైలర్ ఈవెంట్ ను .. ప్రీ రిలీజ్ ఈవెంట్ గా మార్చేశారు. టైమ్ తక్కువ ఉండడంతో ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6 న జరగనుంది. హైదరాబాద్ లోనే గ్రాండ్ గా ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఇక దీంతో మహేష్ ఫ్యాన్స్ ట్రైలర్ కోసం రెడీ అవుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ చేయడానికి ఫ్లెక్సీలు రెడీ చేసుకుంటున్నారు. మరి అన్ని సినిమాలతో పోటీ పడి మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Fatty liver: ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఇలా చేయండి, కొద్ది రోజుల్లోనే నయం..
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Priyanka Gandhi: ఇది ప్రజాస్వామ్య విజయం.. అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టామన్న ప్రియాంకాగాంధీ
-
SRH vs CSK Tickets: డబుల్ రేట్స్, అయినా ఎక్కడా దొరకని టికెట్స్.. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం సొమ్ము చేసుకుంటోందా?
-
VD15: ‘హాయ్ నాన్న’ డైరెక్టర్‌తో విజయ్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో సర్‌ప్రైజ్
ట్రెండింగ్
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!
-
Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!