Guntur Kaaram Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోలో అతడు, ఖలేజా లాంటి సినిమాల తరువాత ముచ్చటగా మూడో సినిమాగా గుంటూరు కారం తెరకెక్కింది. దీంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు కానీ, టైమ్ ఇవ్వకపోవడంతో.. ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ టైమ్ వచ్చేసింది.
ఎట్టకేలకు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. వెయిట్ చేయిస్తే చేయించారు కానీ, ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయింది. మహేష్ ఊర మాస్ లుక్, థమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. త్రివిక్రమ్ డైలాగ్స్, ఆ కుర్చీని మడతబెట్టి సాంగ్ అదిరిపోయాయి. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టడానికి మహేష్ రెడీ అయినట్లు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాధల వదిలేశారు అంటున్నారు అని త్రివిక్రమ్ వాయిస్ తో ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అస్సలు సూపర్ అని చెప్పడం చిన్నమాట అవుతుంది అని అంటున్నారు అభిమానులు. మహేష్ మాస్ లుక్, డైలాగ్స్, కామెడీ పంచులు.. నెక్స్ట్ లెవెల్. ఇక శ్రీలీల అందం సినిమా మొత్తానికే హైలైట్. ముందు నుంచి చెప్తున్నట్లే.. తల్లీకొడుకుల మధ్య అనుబంధాన్ని త్రివిక్రమ్ మరోసారి చూపించాడు. అత్తారింటికి దారేదిలో అత్తా అల్లుళ్ళ మధ్య బంధం ఎలా ఉంటుందో.. ఇందులో తల్లీకొడుకుల మధ్య అలా ఉండబోతుందని తెలుస్తోంది. జనవరి 12 న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి గుంటూరు కారం ఎలా ఉండబోతుందో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.