సూపర్ స్టార్ మహేష్ బాబు యావరేజ్ సినిమాలతో కూడా సాలిడ్ హిట్స్ కొట్టడంలో దిట్ట. రెండు మూడు సినిమాల అనుభవం ఉన్న దర్శకులతో కూడా 150-200 కోట్లు ఈజీగా రాబట్టడం మహేష్ కి అలవాటైన పని. అందుకే మహేష్ ని అందరూ రీజనల్ కింగ్ అంటుంటారు. ఈ కింగ్ ఇప్పుడు మాటల మాంత్రికుడితో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. జనవరి 12న సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కానున్న గుంటూరు కారం సినిమా, రాజమౌళి సినిమాల రేంజ్ కలెక్షన్స్ ని రాబడుతుందని నాగ వంశీ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మామూలుగానే 200 కోట్లు రాబట్టే మహేష్, రాజమౌళి సినిమా రేంజులో అంటే ఆ లెక్క ఎక్కడి నుంచి మొదలై, ఎక్కడ ఆగుతుందో ఊహించడం కూడా కష్టమే.
ఈ మధ్య కాలంలో మహేష్ చేసిన సినిమాలన్నీ మెసేజ్ ఓరియెంటెడ్ గానే ఉన్నాయి. ఒక్కడు, పోకిరి, అతడు, దూకుడు, బిజినెస్ మాన్ రేంజులో మహేష్ బాబు కంప్లీట్ మాస్ సినిమా చేసి చాలా కాలమే అయ్యింది. ఆ లోటుని తీర్చడానికే గుంటూరు కారం సినిమా వస్తుంది. ఆకలితో ఉన్న ఘట్టమనేని ఫ్యాన్స్ కి బిర్యానీ అందిస్తే ఎలా ఉంటుందో గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ ఆ రేంజులో ఉంటాయని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేస్తున్నాయి. రిలీజ్ అయిన తర్వాత రికార్డ్స్ కాదు రిలీజ్ కి ముందు నుంచే ఆ పని మొదలు పెట్టింది గుంటూరు కారం సినిమా. మహేష్ రీజనల్ కింగ్ అనే మాటని మరోసారి నిరూపిస్తూ గుంటూరు కారం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 120 కోట్లకి అమ్ముడయ్యాయి. ఏ స్టార్ హీరో రీజనల్ సినిమాకైనా ఇదే హయ్యెస్ట్. ఇతర ప్రాంతాల బిజినెస్ వివరాలు కూడా బయటకి వస్తే మహేష్ బాబు సింగల్ లాంగ్వేజ్ సినిమాల బిజినెస్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసినట్లే.