Guntur Kaaram: సంక్రాంతికి ఇంకా ఎన్నో రోజులు లేవు.. ఈ సంక్రాంతికి సినిమాల జాతర నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఇప్పటినుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోతే అప్పటికి కష్టమే. ఇక సంక్రాంతి రేసులో అందరి కళ్ళు.. గుంటూరు కారం మీదనే ఉన్నాయి. మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి సాంగ్ వచ్చి కూడా దాదాపు నెల దాటింది. మిగతావారందరూ.. సంక్రాంతికి సినిమా అయినా కూడా వరుస ప్రమోషన్స్ చేస్తూ హైప్ పెంచేస్తున్నారు. కానీ, గుంటూరు కారం టీమ్ మాత్రం నెలకు ఒకటి.. రెండు నెలలకు ఒకటి అప్డేట్స్ ఇస్తున్నారు.
ఎప్పటినుంచో సెకండ్ సింగిల్ అప్డేట్ అడిగితే .. ఎట్టకేలకు ఈరోజు మేకర్స్ అధికారికంగా సెకండ్ సింగిల్ అప్డేట్ ను ఇచ్చారు. వచ్చే సోమవారం.. గుంటూరు కారం సెకండ్ సింగిల్ రిలీజ్ అవుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పుకొచ్చాడు. ఇక ధం మసాలా బిర్యానీ అంటూ.. మొదటి సాంగ్ లో ఊర మాస్ ను చూపించిన మహేష్.. ఈసారి.. మంచి రొమాంటిక్ సాంగ్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. థమన్ మ్యూజిక్.. మహేష్ రొమాంటిక్ సాంగ్స్ పర్ఫెక్ట్ కాంబో అని చెప్పొచ్చు. దీంతో ఈ సాంగ్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో, అందులో ఏ హీరోయిన్ తో మహేష్ స్టెప్స్ వేయనున్నాడో చూడాలంటే ప్రోమో రిలీజ్ వరకు ఆగాల్సిందే.
I will add a #SugarCube also sir 🔥🎧#SweetSpice 🌶️😋#GunturKaaramSecondSingle 🫶 https://t.co/ouuFvMpebU
— thaman S (@MusicThaman) December 6, 2023