Guntur Kaaram: ధమ్ మసాలా బిర్యానీ.. గుద్ది పారేయ్ గుంటూర్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఎప్పటినుంచో ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ రిలీజ్ అవుతుంది.. రిలీజ్ అవుతుంది అని చెప్పుకొస్తున్నారు తప్ప రిలీజ్ చేసింది లేదు. మొన్న దసరాకు కూడా ఈ సింగిల్ రిలీజ్ అవుతుంది అనుకున్నారు. కానీ, అప్పుడు కూడా రిలీజ్ చేయలేదు. ఇక ఈ మధ్యనే ఈ సాంగ్ లిరిక్స్ లీక్ అవ్వడంతో మేకర్స్ దిగివచ్చి.. ప్రోమో ను రిలీజ్ చేశారు. నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు కావడంతో మొదటి సాంగ్ ను రిలీజ్ చేసి త్రివిక్రమ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు.
Bandla Ganesh: త్రివిక్రమ్ బర్త్ డే.. బండ్లన్న పోస్ట్ వైరల్
Also Read
ధమ్ మసాలా బిర్యానీ అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంది. థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ మొత్తం మహేష్ క్యారెక్టర్ ను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్ కు లిరిక్స్ అందించారు. ఇక వీడియోలో మహేష్ ఊర మాస్ మసాలా లుక్ లో అదరగొట్టాడు. ఈ పాటను సంజిత్ హెగ్డే మరియు థమన్ లు కలిసి ఆలపించారు. మహేష్ ఇమేజ్ కి తగ్గట్లుగా మ్యూజిక్ ఉందని, అలాగే లిరిక్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. మొత్తానికి ఫస్ట్ సింగిల్ తో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!