Bandla Ganesh: త్రివిక్రమ్ బర్త్ డే.. బండ్లన్న పోస్ట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో సైతం బండ్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఏ విషయం అయినా కూడా ముక్కుసూటిగా చెప్పుకొచ్చేస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కు బండ్లన్న ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అందరికి తెలిసిందే. ఫ్యాన్ అని కాకుండా బండ్లన్నను భక్తుడు అని పిలవాలి. పవన్ కళ్యాణ్ ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్లన్న స్పీచ్ ఉండాల్సిందే ఇంకా చెప్పాలంటే.. బండ్లన్న స్పీచ్ కోసమే ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు వెళ్లేవారు. ఇక వీరిద్దరి మధ్యలో త్రివిక్రమ్ వచ్చాడు. త్రివిక్రమ్ వచ్చినదగ్గరనుంచి బండ్ల.. పవన్ కు దూరమయ్యాడని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలోనే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల కు ఆహ్వానం రాలేదు. ఆ సమయంలో బండ్ల.. త్రివిక్రమ్ పై విరుచుకుపడ్డాడు. అభిమానులతో త్రివిక్రమ్ గురించి ఘాటు ఆరోపణలే చేశాడు. అప్పుడు బండ్ల ఆడియో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Bigg Boss 7 Telugu: సీజన్ మొత్తం లో అల్టిమేట్ ప్రోమో అంటే ఇదేరా..
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇక సమయం చిక్కినప్పుడల్లా.. గురూజీ ని విమర్శించే బండ్ల.. నేడు త్రివిక్రమ్ కు బర్త్ డే విషెస్ చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు కావడంతో ఉదయం నుంచి సెలబ్రిటీలు అందరూ.. మాటల మాంత్రికుడుకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక తాజాగా బండ్ల కూడా.. ” త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు .. మీకు జన్మదిన శుభాకాంక్షలు. గుంటూరు కారం సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు . మొన్నటివరకు ఓ రేంజ్ లో తిట్టేసి.. ఇప్పుడేంటి సడెన్ గా బర్త్ డే విషెస్ చెప్తున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం బండ్లన్న పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
#TrivikramSrinivas garu a very happy birthday. Wishing you a blockbuster with #GunturKaaaram. pic.twitter.com/jJPkWEKAa4
— BANDLA GANESH. (@ganeshbandla) November 7, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!