Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తోంది. గుంటూరు కారం సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక గొడవ బయటకు వస్తూనే ఉంది. మొదట ఈ సినిమా నుంచి పూజా హెగ్డే బయటకు వచ్చేసింది. అయితే పూజా బయటకు రావడానికి కారణం వేరే వేరే కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే అలాంటిదేమి లేదని, పూజాకు డేట్స్ అడ్జెస్ట్ కాలేక సినిమానుంచి వైదొలగిందని, ఆమె తమ ఇంటి పిల్ల అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలపడంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది. ఇకపూజా తరువాత ఈ సినిమా నుంచి డీఓపీ పీఎస్ వినోద్ బయటికి వచ్చేశాడు. ఇక ఆయన ప్లేస్ లో డీఓపీ మనోజ్ పరమహంస వచ్చి చేరాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో గుంటూరు కారం సినిమాపై ఆసక్తికరమైన వవిషయాలను పంచుకున్నాడు.
Director Ubaini: సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చారని ఆ పని చేసిన డైరెక్టర్..
“నాకు ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. మహేష్ బాబు అంటే అందరికీ నచ్చిన ఒక కుటుంబంలోని మనిషి. మా ఫ్రెండ్స్ ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. మహేష్ తో ఎందుకు సినిమా చెయ్యట్లేదు అని.. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. మహేష్ గారికి సినిమాటోగ్రఫీ లో తెలియని విషయం లేదు. ఆయనతో సినిమా అంటే ఒక ఛాలెంజ్ లా ఉంటుంది. ఎందుకంటే చిన్న తప్పు చేసినా ఆయన కనిపెట్టేస్తారు. వేరే హీరోల్లా కాకుండా ఆయన అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటారు. ఆయన అన్నీ డిటైల్డ్ గా చూడడం నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఆయన ఒక విషయం చెప్పారు అంటే పర్ఫెక్ట్ గా, కథకి సూట్ అయ్యేలా ఉంటది. ఆ పాయింట్స్ తీస్కొని విడమర్చి చెప్పినట్లు చేస్తే అవుట్ ఫుట్ బాగా వస్తుంది. పీఎస్ ఆనంద్ గారికి వేరే కమిట్మెంట్స్ వల్ల వెళ్లాల్సి వస్తే థమన్ నాకు ఫోన్ చేసి పిలిచారు, గుంటూరు కారం చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్, నేను చేయాలి అని చెప్పారు. నాకు వేరే కమిట్మెంట్ ఉంటే, వంశీ గారు మాట్లాడి డేట్స్ అడ్జస్ట్ చేశారు” అని చెప్పుకొచ్చాడు. దీంతో సినిమాపై మరింత హైప్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలంటే వచ్చే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.