Guntur Kaaram Beedi is not made of Nicotine says Mahesh Babu: ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకులు ముందు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు రమణ అనే క్యారెక్టర్ లో నటించాడు. ఈ క్యారెక్టర్ ప్రకారం ఎక్కువగా ఆయన బీడీ తాగుతూ ఉంటాడు. అయితే గతంలోనే మహేష్ బాబు స్మోకింగ్ మానేసి తాను పొగాకు ఉత్పత్తులను ప్రమోషన్ కూడా చేయనని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి సినిమాలో మహేష్ బాబు ఇలా బీడీ తాగుతూ తన అభిమానులకు ఎలాంటి మెసేజ్ ఇచ్చాడు అని చాలా ట్రోలింగ్స్ కూడా సోషల్ మీడియాలో నడిచాయి. అయితే ఇదే విషయం మీద తాజా ఇంటర్వ్యూలో మహేష్ బాబు స్పందించాడు.
Mahesh Babu: గుంటూరు కారం మహేష్ కి చివరి తెలుగు సినిమా? సంచలన వ్యాఖ్యలు వైరల్!
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ చేత ఒక ఇంటర్వ్యూ చేయించారు. మహేష్ బాబు, శ్రీ లీల పాల్గొన్న ఈ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించాడు మహేష్. ఈ సినిమాలో వాడింది నిజమైన బీడీ కాదని ఆయుర్వేద బీడీ అని చెప్పుకొచ్చారు. ఈ బీడీలో పొగాకు ఉండదని ఆయన పేర్కొన్నారు. నిజానికి మొదట తనకి పొగాకు బీడీ ఇచ్చారని అయితే అది తాగిన వెంటనే తనకు మైగ్రేన్ వచ్చిందని అన్నారు. దీంతో వెంటనే ఈ విషయాన్ని త్రివిక్రమ్ దృష్టికి తీసుకు వెళ్లి తాను ఆ బీడీ తాగలేనని తేల్చి చెప్పానని, వెంటనే త్రివిక్రమ్ టీంతో కలిసి ఆలోచించి ఆయుర్వేద బీడీ తెప్పించి ఇచ్చారని అన్నారు. అది పలు సుగంధద్రవ్యాల ఆకులతో తయారు చేసిన బీడీ అని అది తాగితే మింట్ ఫ్లేవర్ వస్తుంది తప్ప ఎలాంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు.