మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
ఈ సినిమా రాంచరణ్ కెరీర్ లో 15వ చిత్రంగా వస్తుండగా.. చిత్ర బృందం భారీ స్థాయిలో లాంచ్ చేయబోతుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలు రేపు జరుగునున్నాయి. ఈమేరకు చిత్రబృందం పోస్టర్ ద్వారా తెలిపారు. పూజ కార్యక్రమం నేపథ్యంలో కియారా నేడు హైదరాబాద్ చేరుకుంది. శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి మెగా కుటుంబం కూడా #RC15 లాంచ్ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ కూడా హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది.