తన వృత్తి అయిన సినిమాలు చేస్తూనే రాజకీయాలలో కూడా క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు పవన్ కళ్యాణ్. సినిమాలు మరియు రాజకీయాలు అనేది రెండు కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేనివి.రెండిటినీ కూడా ఒకేసారి మ్యానేజ్ చెయ్యడం అయితే ఎంతో కష్టం. అందుకే సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా జరుగుతూ వుంటారు.సీనియర్ ఎన్టీఆర్ అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే పని చేసారు.పవన్ కళ్యాణ్ మాత్రం రెండిటినీ కూడా ఎంతో సమర్ధవతంగా బ్యాలన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు అయితే ఉన్నాయి. అందులో ‘బ్రో ది అవతార్’ మూవీ షూటింగ్ అయితే పూర్తి అయ్యింది. ప్రస్తుతం OG , ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరి హర వీరమల్లు వంటి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయని సమాచారం.. అలాగే #OG మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా గడిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జూన్ 14 వ తారీఖు నుండి వారాహి యాత్రలో పాల్గొనబోతున్నారు.
ఈ యాత్ర ప్రారంభం అయ్యే ముందే ఆయన ఒక మహా యాగాన్ని కూడా నిర్వహించాడు. ఈ యాగం రెండు రోజుల పాటు అయితే జరగనుంది, నిన్న జరిగిన యాగానికి పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం సినిమాలు తీస్తున్న నిర్మాతలందరూ కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని సందర్శించి, ఆయన తలపెట్టిన ఈ కార్యక్రమం గొప్పగా విజయం సాధించాలని అందరూ శుభాకాంక్షలు తెలియచేసారు. అంతే కాకుండా జూన్ 14 వ తారీఖు నుండి పవన్ కళ్యాణ్ జనాల్లోనే ఉండబోతున్నాడు కాబట్టి, ఇక నుండి సినిమా షూటింగ్స్ అన్నీ విజయవాడ మరియు గుంటూరు పరిసరాల్లోనే నిర్వహిస్తామని దర్శక నిర్మాతలు చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్ పెరగాలి అంటే కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ లో షూటింగ్ చేసి అయితే ఉండాలి అంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక రూల్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతాయి కాబట్టి ఆయన సినిమాలకు టికెట్ రేట్ పెరిగే అవకాశం అయితే ఉంది.