Romantic Movie OTT: థియేటర్లలో దేకలే… ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Romantic Movie OTT: గ్రామీణ జీవితంలోని మట్టివాసన, అమాయక ప్రేమ, సరదా సంఘటనలు తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రత్యేకంగా కనెక్ట్ అవుతారు. అయితే ప్రతి మంచి కథ థియేటర్లలో విజయం సాధించాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాలు వెండితెరపై ఆశించిన స్థాయిలో మెప్పించకపోయినా, డిజిటల్ వేదికలపై మాత్రం దూసుకెళ్తుంటాయి. ఇప్పుడు అలాంటి అరుదైన మలుపునే చూసింది తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ‘గోదారి గట్టుపైనా’ (Godari Gattupaina). థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమా, ఓటీటీలో మాత్రం ప్రేక్షకుల ఆకట్టుకుంటూ ట్రెండింగ్ జాబితాలో చోటు సంపాదించడం విశేషం.
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. ప్రముఖ నటుడు జగపతి బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం మరో ప్రత్యేకత. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు నిర్మాతగా వ్యవహరించారు. గ్రామీణ మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, ప్రేమలో ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలను దర్శకుడు తెరపై చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. 2026 మే 8 న థియేటర్లలో విడుదల అయిన ఈ మూవీకి ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కలేదు. పలు కారణాల వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వెనుకబడింది. కథనం నెమ్మదిగా సాగడం, విడుదల సమయంలో ఎదురైన పోటీ, ప్రమోషన్ల ప్రభావం వంటి అంశాలు కూడా సినిమాపై ప్రభావం చూపినట్లు సినీ విశ్లేషకులు భావించారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
అయితే ఓటీటీ ప్రపంచం మరోసారి ఒక విషయాన్ని నిరూపించింది. మంచి కంటెంట్ ను ప్రేక్షకులు ఎప్పటికైనా ఆదరిస్తారనే విషయాన్ని ‘గోదారి గట్టుపైనా’ మరోసారి గుర్తు చేసింది. మే 29 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు రావడంతో అనూహ్యంగా ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. థియేటర్లలో పెద్దగా గుర్తింపు పొందని సినిమా, డిజిటల్ వేదికపై ఇంతటి స్పందన పొందడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా వేదికలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండటం మరింత మంది ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, గ్రామీణ ప్రేమకథలను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఆసక్తిగా వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో మిస్సైన అవకాశాన్ని ఓటీటీ ద్వారా సద్వినియోగం చేసుకుంటున్న ‘గోదారి గట్టుపైనా’ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో తన విజయగాథను కొత్తగా రాస్తుండటం విశేషం.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం