RC 17: పుట్టిన రోజుకు ముందే పండుగ మొదలెట్టండి.. రికార్డుల వేటకు రంగస్థలం కాంబో రిపీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RC 17 Movie with Sukumar Announced: జరుగుతున్న ప్రచారమే నిజమైంది. చాలా కాలం నుంచి రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ పుట్టినరోజుకు సరిగ్గా రెండు రోజుల ముందు ఈ విషయాన్ని ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటన వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నట్లు కూడా అధికారికంగా ప్రకటన చేశారు. గుర్రాలు రేసుకు సిద్ధమవుతున్నట్లుగా ఉన్న ఒక ఫోటోని సైతం ఈ సందర్భంగా సినిమా యూనిట్ షేర్ చేసింది.
GOG : మోత మోగించేస్తున్న అయేషా ఖాన్ స్పెషల్ సాంగ్.. చూశారా?
Also Read
- Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
- Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
- Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
- Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ సహా నిర్మించబోతుందని క్లారిటీ వచ్చేసింది. రేరింగ్ టు కాంక్వర్-అంటే ఆక్రమించడానికి రంగంలోకి దిగుతున్నాం అంటూ ప్రకటించారు. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ ఐకాన్‌గా గుర్తింపు పొందారు రామ్‌చరణ్. ఇటు పుష్ప సినిమాతో తగ్గేదేలే అంటూ అందరివాడనిపించుకున్నారు మూవీ మాస్టర్ సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ సినిమా మీద మన దగ్గరే కాదు, దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ అందుకునేలా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు సుకుమార్. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలుపెడతారు. 2025 లాస్ట్ క్వార్టర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, డీఎస్పీ కాంబినేషన్లో రెండో సినిమా ఇది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా అలరించనుంది.
ప్రస్తుతానికి రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజెర్ అనే సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా మొన్న సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది కానీ పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క రాంచరణ్ 16వ సినిమా కూడా ఈ మధ్యనే ఘనంగా ప్రారంభమైంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాల్లో శివ రాజ్ కుమార్ సంజయ్ దత్ వంటి హేమా హేమీలు నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్‌లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!