మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం “గని” ఏప్రిల్ 8న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ బాక్సింగ్ డ్రామా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ కూడా అంగీకరించారు. ఓ లేఖ ద్వారా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని, కానీ వారిని అలరించడానికి మరింత కష్టపడతానని హామీ ఇచ్చారు. ఇక తాజా అప్డేట్ ఏమిటంటే “గని” సినిమా ఓటిటి విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది.…