Gemini TV Sankranthi Sambaralu: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ముందు వరుసలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
![Sankranthi1[1]](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/01/sankranthi11.jpg)
పాడి పంటలు, భోగ భాగ్యాలతో కళకళలాడే తెలుగు లోగిళ్లు ముచ్చట గొలిపే ముగ్గులు కొత్త అందాన్నిస్తాయి.
అలాంటి రంగవల్లులనే..అతివలతో అందంగా తీర్చిదిద్దే కార్యక్రమంగా సంక్రాంతి సంబరాలు పేరుతో.. తాడేపల్లిగూడెం, రాజమండ్రి పట్టణాల్లో వేలాదిమంది మహిళామణులను ఒకచోట చేర్చి ముగ్గుల పోటీ నిర్వహించింది.
ముగ్గుల పోటీలకు ఈ రెండు పట్టణాల్లో విశేషమైన స్పందన లభించింది.. వేలాదిగా మహిళలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
జెమిని సంక్రాంతి సంబరాల్లో విజేతలకు చక్కటి బహుమతులను జెమినీ టీవీ అందించి సత్కరించింది.