Site icon NTV Telugu

Gayathri Gupta: ఛీఛీ.. భర్తకు విడాకులిచ్చి.. ఇలాంటి పనులు చేస్తున్నావా.. ?

Gayatri

Gayatri

Gayathri Gupta: తెలుగమ్మాయి గాయత్రీ గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆమె చేసిన రచ్చ అంతాఇంతా కాదు. తన బాయ్ ఫ్రెండ్ తనను మోసం చేసాడని మీడియా ముందు ఘాటు ఆరోపణలు చేసి అటెన్షన్ మొత్తం కొట్టేసింది. అనంతరం పెళ్లి చేసుకొని అతనికి విడాకులు ఇచ్చి మరింత షాక్ కు గురిచేసింది. ఆ తరువాత వరుస అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ గా నటించి మంచి పేరు తెచ్చుకొంది. ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి సినిమాలే పడ్డాయి. అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, ఐస్‌క్రీమ్-2, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్‌ ది రోడ్, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. చాలా గ్యాప్ తరువాత గాయత్రీ గుప్తా.. దయ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రేప్ కు గురికాబడిన స్వేచ్ఛ అనే పాత్రలో నటించి మెప్పించింది.

Sai Pallavi: అదేం వింత అలవాటు పాప.. దాన్ని తినడమేంటి ..?

ఇక సినిమాలు ఏమో కానీ.. ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా అమ్మడి అరాచకం మాములుగా లేదు. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో విరుచుకుపడిపోతుంది. తాజాగా గాయత్రీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వైట్ కలర్ టాప్.. తలకు క్యాప్.. కింద కేవలం ప్యాంటీతో నిలబడిన ఫోటోను షేర్ చేసింది. దానికి ఏదిఏమైనా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఈ ఫోటో, వీడియో చూసిన అభిమానులు ఆమెను ఏకిపారేస్తున్నారు. ఛీఛీ.. భర్తకు విడాకులిచ్చి.. ఇలాంటి పనులు చేస్తున్నావా.. ? అని కొందరు అంటుండగా.. అప్పుడప్పుడు నువ్వు కూడా ఉన్నవని గుర్తించడానికి ఇలాంటి ఫోటోలు పెడుతున్నావా.. ? అని ఇంకొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం గాయత్రీకి సపోర్ట్ చేస్తున్నారు. నెగటివ్ కామెంట్స్ వినాల్సిన అవసరం లేదు.. నీ మనసుకు నచ్చినట్లు నువ్వు చెయ్ అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ భామ.. ముందు ముందు ఎలాంటి పాత్రల్లో కనిపించనుందో చూడాలి.

Exit mobile version