Bigg Boss 9 : బిగ్బాస్ సీజన్ 9 లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్లోనే చాలా ట్విస్టులు కనిపిస్తున్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కాంట్రవర్సీ కంటెస్టెంట్లను తీసుకువచ్చి నానా రచ్చ చేయాలని చూశారు. కానీ ప్రేక్షకులు చిరాకు పడటంతో వాళ్ళందరినీ బయటకు పంపించేశారు. ఇక ఈ సీజన్ లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వారిని తీసుకువచ్చి పోటీ పెట్టారు. అందులో విన్ అయిన భరణిని హౌస్ లో ఉంచారు. సోమవారం నామినేషన్ కు సంబంధించి రచ్చరచ్చ జరిగింది. ఏకంగా పవన్, కళ్యాణ్ కొట్టుకున్నారు. ఇదే మహా దారుణమైతే ఇప్పుడు ఇంకో దారుణం జరిగింది.
Read Also : Mahavatar Narsimha : ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహా..!
ఈవారం కెప్టెన్సీ కోసం భరణితో పోటీపడేందుకు ఏడో సీజన్ లో అశ్వద్ధామ గా పేరు తెచ్చుకున్న గౌతమ్ కృష్ణను తీసుకొచ్చారు. అతను గత సీజన్ లో రన్నర్ గా నిలిచాడు. కెప్టెన్సీ టాస్క్ కోసం హౌస్ లో ఉన్న వారితో పోటీ పెడితే బాగుంటుంది కానీ గత సీజన్లకు చెందిన కంటెస్టెంట్లను ఎందుకు తీసుకువస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో భరణి గెలిచినట్టు తాజా ప్రోమోలో చూపించారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటి అనేది పూర్తి ఎపిసోడ్ వస్తేనే తెలుస్తుంది కదా. ఇలా పాత కంటెస్టెంట్లను తీసుకువచ్చి ప్రేక్షకులకు మరింత చిరాకు తెప్పించటం ఎందుకు అంటున్నారు బిగ్ బాస్ విమర్శకులు. ఇప్పుడు వచ్చిన గౌతమ్ కృష్ణ హౌస్ లో కంటిన్యూ అవుతాడా లేదంటే ఈ ఒక్క టాస్క్ ఆడి వెళ్లిపోతాడా అనేది వేచి చూడాలి.
Read Also : Akhanda 2 : ఇద్దరు సీఎంలను రంగంలోకి దించుతున్న బాలయ్య..?