Gauri Khan: అంతకుమించిన నరకం మరొకటి లేదు.. ఆర్యన్ అరెస్ట్‌పై స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gauri Khan Reacts On Aryan Khan Arrest In Koffee With Karan Show: గతేడాది డ్రగ్స్ కేసులో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టైన సంగతి తెలిసిందే! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. ఆ తర్వాత అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై చాలా రోజుల తర్వాత స్పందిస్తూ.. ఆ ఘటన వల్ల తానెంతో కుంగిపోయాయని, తప్పు చేయకపోయినా కుటుంబ పరువు బజారున పడిందంటూ ఆవేదన ఆర్యన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత అతని తల్లి గౌరీ ఖాన్ తొలిసారి ఆర్యన్ అరెస్ట్‌పై స్పందించింది. కాఫీ విత్ కరణ్ షోలో పరోక్షంగా ఆర్యన్ అరెస్ట్‌ని ప్రస్తావిస్తూ.. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారని కరణ్ జోహర్ సంధించిన ప్రశ్నకు గౌరీ ఖాన్ ఇలా స్పందించారు.
‘‘ఆ సమయంలో మేమంతా ఎంతో బాధపడ్డాం. ముఖ్యంగా.. ఒక తల్లిగా నేను నరకం అనుభవించాను. అయితే, మేము అంతే బలంగా నిలబడ్డాం. అప్పుడు అందరూ ఒక కుటుంబంలా మాకు అండగా నిలబడ్డారు. ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులు సైతం మెసేజ్‌లు చేసి, మమ్మల్ని ఓదార్చారు. ధైర్యం నింపారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు అండగా నిలిచిన ప్రతిఒక్కరూ కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నా’’ అని గౌరీ ఖాన్ చెప్పుకొచ్చారు. కాగా.. ముంబైలో ఒక క్రూజ్ షిప్లో డ్రగ్స్ లభించడం, అదే నౌకలో ఆర్యన్ ఖాన్ ఉండటంతో, పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్ 3న ఆర్యన్‌ని అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు.. 28 రోజులపాటు అతడ్ని జైల్లోనే ఉంచారు. అక్టోబర్ 30న బెయిల్‌పై విడుదలయ్యాడు. చివరికి ఆర్యన్‌కి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో, ఎన్సీబీ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది.
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!