Gangs Of Godavari to Release on May 31st: గామి హిట్ తో ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఆయన ‘ఛల్ మోహన్ రంగ’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమా చేశాడు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా మే 17న విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇంకేముంది సినిమా రిలీజే అనుకుంటున్న సమయంలో సినిమాను మే 31కి వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తనకు బాగా కలిసొచ్చిన ఫలక్ నామా దాస్ రిలీజ్ డేట్ అయిన మే 31న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి మరో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు.
Preminchoddu: బేబీ నాదన్న డైరెక్టర్ నుంచి ‘ప్రేమించొద్దు’.. జూన్ 7న రిలీజ్!
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన స్వరపరిచిన ఆల్బమ్ నుంచి విడుదలైన పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఓ వ్యక్తి ప్రయాణంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇక ఇటీవల విడుదలైన టీజర్‌తో, మేకర్స్ లంకల రత్న పాత్ర ఎలా ఉండనుంది? అతని ప్రపంచం ఎలా ఉండనుంది? అనే క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ టీజర్ చాలా మంది సినీ-ప్రేమికులను ఆకర్షించింది. ఈ టీజర్ తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. అనిత్ మదాడి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. ఇక తాజా అప్డేట్ ప్రకారం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ మే 31నే హరోంహర, సత్యభామ, భజే వాయువేగం, గం గం గణేశా, మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.