Gangavva : మై విలేజ్ షో గంగవ్వకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా యూట్యబ్ వీడియోలతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాంటి గంగవ్వకు ఓ సంప్రదాయబద్ధమైన లుక్ ఉంది. ఆమెను చూస్తే ఎవరికైనా వాళ్ల నానమ్మ లేదా అమ్మమ్మ గుర్తుకు వస్తుంది. నిండైన సంప్రదాయంగా కనిపించేది. అలాంటి గంగవ్వ తాజాగా లుక్ మొత్తం ఛేంజ్ చేసింది. ఆమె తాజా ఫొటోలు చూసిన వారంతా.. అసలు ఈమె గంగవ్వనేనా అంటూ షాక్ అవుతున్నారు. గంగవ్వ ఏంటి ఇలాం మారిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. గంగవ్వ తాజాగా ఓ సెలూన్ కు వెళ్లింది.
Dear Uma: నటించడం చాలా సులభం… నిర్మాతగా ఉండటం చాలా కష్టం!
అక్కడ ఆమె హెయిర్ ను స్ట్రెయిటినింగ్ చేయించుకుంది. పనిలో పనిగా తన హెయిర్ కు బ్లాక్ కలర్ వేసుకుంది. కాలికి పెడిక్యూర్ కూడా చేసుకుంది. గంగవ్వ తన హెయిర్ ను లూజుగా వదిలేసి కొత్త లుక్ లోకి మారిపోయింది. ఇందులో గంగవ్వ ముఖం మీద ముడతలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా గంగవ్వ కొత్త లుక్ లోకి మారిపోయింది. ఇది చూసిన వారంతా అసలు గంగవ్వకు ఏమైంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. లేకుండా కనిపి కాస్త యవ్వనంగా కనిపించడంతో గంగవ్వ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ -5 సీజన్ లో పాల్గొన్న గంగవ్వ.. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలతోనే బిజీగా గడిపేస్తోంది.