చంద్రబోస్ ఆవిష్కరించిన ‘జెట్టి’ సినిమా గీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘జెట్టి’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దీనికి దర్శకుడు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించిన ‘జెట్టి’ సినిమాలోని ‘గంగమ్మ గంగమ్మ మాయమ్మ..’ అనే పాట లిరికల్ వీడియోను ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఆవిష్కరించారు. గంగపుత్రుల జీవన విధానాన్ని తెలిపేలా సాగే ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
ఈ సందర్భంగా గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ, ”ఇటీవల ‘పుష్ప’ సినిమాలో అడవి మీద పాట రాశాను. ఇప్పుడు ‘జెట్టి’ మూవీలో సముద్రం గురించి, గంగపుత్రుల జీవితం గురించి ‘గంగమ్మ గంగమ్మ మాయమ్మ…’ అనే పాట రాశాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకుడికి కృతజ్ఞతలు. చాలా చక్కటి పాట ఇది. సముద్ర ఘోష ఈ పాటలో వినిపించేలా కంపోజిషన్ చేశారు సంగీత దర్శకుడు కార్తీక్. గీత రచయితగా ఈ పాట రాయడం నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. అనురాగ్ కులకర్ణి అంతే చక్కగా పాడాడు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
Also Read
- ‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
- SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
- Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
- Dada : 'దాదా' మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
ఓ మత్య్సకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని ‘జెట్టి’ సినిమాను తెరకెక్కించారు. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటి వరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను తెరమీదకు హృద్యంగా తీసుకురాబోతున్నాడు దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక.
తాజావార్తలు
-
Virat Kohli: “ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది”.. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
-
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
-
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?