Gandharwa:ఈ యేడాది ద్వితీయార్థంలో విడుదలైన చిన్న చిత్రాలలో కథపరంగా వైవిధ్యతను చాటుకుంది ‘గంధర్వ’. అప్సర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఫన్ని ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది. సందీప్ మాధవ్ , గాయత్రీ ఆర్ సురేష్ జంటగా నటించిన ఈ చిత్రంలో సాయి కుమార్ , సురేష్ బాబు , బాబు మోహన్ , పోసాని , సమ్మెట గాంధీ , టెంపర్ వంశీ , సూర్య , పాల్ , జయరాం తదితరులు కీలక పాత్రలు పోషించారు. యాంటి ఏజింగ్ కాన్సెప్ట్ పై చేసిన కొత్త ప్రయోగం విమర్శకులను సైతం మెప్పించింది .
ఒక సంఘటనలో ఆక్సిజన్ చాంబర్ లో ఇరుక్కు పోయిన కథా నాయకుడికి కళ్ళు తెరిచే సరికి యాభై ఏళ్ళు గడిచి పోతాయి . కాని అతని వయసు మాత్రం మారాదు . తిరిగి ఇంటికి చేరుకున్న హీరో కి తన భార్య డెబ్భై ఏళ్ల ముసలావిడ గా, కొడుకు యాభై ఏళ్ల వ్యక్తిగా కలుస్తారు. పాతికేళ్ళ తండ్రికి యాభై ఏళ్ల కొడుకుకి మధ్య జరిగిన యుద్ధం ఏమిటీ? అసలు ప్రపంచం దీనిని ఎలా నమ్మింది? అనే కథాంశంతో దర్శకుడు అప్సర్ తన తొలి ప్రయత్నం లోనే భారీ స్పాన్ ఉన్న కథను ఎంచుకున్నాడు . జూలై 8న థియేటర్లలో రిలీజ్ అయిన ‘గంధర్వ’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా తన హవా కొనసాగిస్తోంది. ఈ సినిమాకు ఓటీటీలో లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని నిర్మాణ సంస్థ దీన్ని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డబ్ చేసి ఇదే నెలాఖరులో రిలీజ్ చేసే పనిలో పడింది. ఇదే సమయంలో దర్శకుడు అఫ్పర్ కూ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నుండి కొత్త చిత్రంకై ఛాన్స్ వచ్చిందని, అందుకై ఆయన కథను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.