Gandeevadhari Arjuna Trailer: భూమికి పట్టిన అతిపెద్ద క్యాన్సర్.. మనిషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandeevadhari Arjuna Trailer: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాండీవధారి అర్జున. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో ప్రవీణ్ సత్తారు తన యాక్షన్ మార్క్ చూపించాడు. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో హీరోలందరూ ఏజెంట్స్ గానే కనిపించారు. ఇందులో కూడా వరుణ్ తేజ్, అర్జున్ అనే ఏజెంట్ గా కనిపించాడు. ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ తో నింపేశాడు డైరెక్టర్. “డిసెంబర్ 2020 లో దేవుడు మీద మనిషి గెలిచాడంట.. జస్ట్ 25 వేల సంవత్సరాలలో మనిషి చేసిన వస్తువులు .. దేవుడు చేసిన వాటిని మించిపోయాయి అంట” అంటూ నాజర్ చెప్తున్న డైలాగ్ తో ట్రైలర్ ఓపెన్ అయ్యింది. నాజర్ ఒక మినిస్టర్ గా చూపించారు. అతడు చెప్పిన ఒక పని కోసం ఏజెంట్ అర్జున్ రంగంలోకి దిగుతాడు. చూస్తుంటే ఈసారి ప్రవీణ్ సత్తారు మెడికల్ మాఫియాను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ మాఫియాకు లీడర్ గా వినయ్ రాయ్ ను చూపించారు.
Jailer: జైలర్ బాలేదన్న విజయ్ ఫ్యాన్ ని చావచితక్కొట్టారు!
Also Read
ఇక ఆ మెడికల్ మాఫియాను కనుకొనే ప్రయత్నంలో హీరోయిన్ ఐరా కనిపించకుండా పోవడం, ఆమె కోసం అర్జున్ వెతుకుతూ నిజాన్ని రాబట్టడం ట్రైలర్ లో చూపించారు. అస్సలు వినయ్ రాయ్ చేస్తున్న మెడికల్ మాఫియా ఏంటి.. ? దానికి, చిన్న పిల్లలకు సంబంధం ఏంటి.. ? ఈ మెడికల్ మాఫియా వలన దేశాన్నికి పొంచి ఉన్న ముప్పు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఏజెంట్ అర్జున్ గా వరుణ్ అదరగొట్టేశాడు. లొకేషన్స్ హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. ఇక మిక్కీ జే మేయర్ సంగీతం చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్‌గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
-
Peddi : చరణ్ ‘పెద్ది’ కోసం రంగంలోకి బాలయ్య..!
-
Xiaomi 17 Max: 8000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో.. షియోమీ 17 మ్యాక్స్ విడుదల
-
Sai Abhyankar: ట్రోల్స్‌ను ట్రెండ్‌గా మార్చిన సాయి అభ్యంకర్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!