RajiniKanth: ఏది.. ఇప్పుడు మొరగండి.. చూద్దాం.. అక్కడ ఉన్నది తలైవా రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RajiniKanth: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు తలైవా పేరు ప్రపంచమంతా మారుమ్రోగిపోతుంది. జైలర్ సినిమాతో రజినీ భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు మూడేళ్ళ తరువాత రజినీ ఇంతటి హిట్ ను అందుకున్నాడు. 2019 లో పేట సినిమాతో రజినీ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ఆయన నటించిన దర్బార్, అన్నాతే సినిమాలు డిజాస్టర్లు గా నిలిచాయి. మధ్యలో తలైవా అనారోగ్యం పాలయ్యారు. 72 ఏళ్ళ వయస్సు.. కథలు ఎంచుకోవడం రజినీకి చేతకావడం లేదని కొంతమంది.. కుర్ర డైరెక్టర్లను నమ్ముకొని ప్లాప్ లు అనుకుంటున్నాడని.. ఈ వయస్సులో సినిమాలు వద్దు అని ఇలా రకరకాలుగా రజినీపై విమర్శలు వచ్చాయి. ఇక ఇవి కాకుండా సినిమాలు ఆపేసి రాజకీయాలకు రావాలని మరికొందరు ఒత్తిడి తెచ్చినవారు ఉన్నారు. ఇక జైలర్ సినిమాలో నువ్వు కావాలయ్యా సాంగ్ రిలీజ్ అయ్యినప్పుడు రజినీ డ్యాన్స్ పై కూడా ట్రోల్స్ వచ్చాయి. ఆ స్టెప్స్ ఏంటి.. ? ఈ వయస్సులో ఆ సాంగ్ ఏంటి, తమన్నాతో రొమాన్స్ ఏంటి.. ? అంటూ విమర్శలు చేశారు.
Nelson Dilipkumar: ఈ డైరెక్టర్ వేస్ట్.. రజినీ సినిమాను పాడు చేస్తాడు అన్నారు.. కానీ,
Also Read
అసలే నెల్సన్ బీస్ట్ సినిమాతో ప్లాప్ ఇచ్చి ఉన్నాడు. ఆయనతో సినిమా అనేసరికి జైలర్ పై అస్సలు అంచనాలు లేవు. కానీ, సాంగ్స్, ట్రైలర్ తో ఒక్కసారిగా హైప్ వచ్చాయి. మరీ ముఖ్యంగా రజినీకాంత్ ఆడియో లాంచ్ స్పీచ్ వలన సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. “మొరగని కుక్కలేదు.విమర్శించని నోరు లేదు. ఇవి రెండూ జరగని ఊరు లేదు. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి” అంటూ ట్రోలర్స్ కౌంటర్ ఇచ్చేశాడు. ఇక ఈరోజు జాలిర్ రిలీజ్ అయ్యింది. ఈ వయసులోనూ రజినీని సూపర్ స్టైలిష్ గా చూపించాడు. చిన్న స్మైల్.. చిన్న లుక్ తోనే రజినీ అభిమానులను కట్టి పడేశాడు. రజినీ అభిమానులకు ఐ ఫీస్ట్ గా జైలర్ నిలిచింది. ఇక ఈ హిట్ తో ఆయన అభిమానులు ట్రోలర్స్ కు కౌంటర్లు వేస్తున్నారు.ఏది.. ఇప్పుడు మొరగండి.. చూద్దాం.. అక్కడ ఉన్నది తలైవా రా అంటూ సవాల్ చేస్తున్నారు. మరి జైలర్ రికార్డుల వేట ఎలా ఉందనున్నదో చూడాలి.
తాజావార్తలు
-
KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
-
YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!