Game On: రియల్ టైమ్ సైకలాజికల్ ‘గేమ్ ఆన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game On Movie to release on February 2nd: గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ‘గేమ్ ఆన్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతోంది. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా గురించి నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ గేమ్ ఆన్ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, సినిమాను ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. రథం చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గీతానంద్ ఈ చిత్రంతో హీరోగా నెక్ట్స్ లెవల్ కు వెళ్తాడన్న నమ్మకం ఉందని నేహ సోలంకి తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటుందన్నారు. ‘కార్తికేయ 2’తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య మీనన్ ఈ సినిమాలో కూడా ఓ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో నటించాడని, ప్రజంట్ విభిన్నమైన కథలతో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కబట్టు అదే కోవలో వస్తోన్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నామని అన్నారు.
Satyabhama: “సత్యభామ” ఎక్కడా తగ్గట్లేదుగా!
Also Read
దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ ఈ సినిమాలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయని, ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి ,రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి? ఈ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ సినిమా ఉంటుందని అన్నారు. గీతానంద్, నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాల, వాసంతి, కిరిటీ, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్; అభిషేక్ ఏ ఆర్ సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్ అందించారు.
తాజావార్తలు
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!